హిట్ ఎవరిది? హైప్ ఎవరిది? బాలీవుడ్‌లో హాట్ డిబేట్!

బాలీవుడ్‌లో కొత్త తరం హీరోల మధ్య పోటీ క్రమంగా రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలో ల‌క్ష్య‌, అహాన్ పాండే పేర్లు తరచూ చర్చకు వస్తున్నాయి.;

Update: 2026-04-13 13:16 GMT

బాలీవుడ్‌లో కొత్త తరం హీరోల మధ్య పోటీ క్రమంగా రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలో ల‌క్ష్య‌, అహాన్ పాండే పేర్లు తరచూ చర్చకు వస్తున్నాయి. వీరి కెరీర్ ప్రారంభ దశలోనే కనిపిస్తున్న ఈ పోటీ, ఇండస్ట్రీలోని పాత చర్చలను మరోసారి ముందుకు తెస్తోంది. ముఖ్యంగా అవుట్‌సైడర్ వ‌ర్సెస్ ఇన్‌సైడ‌ర్ అనే దానికి బలమైన పునాది ఇస్తోంది. ల‌క్ష్య ఒక అవుట్‌సైడర్‌గా ఇండస్ట్రీలోకి వచ్చి తన అవకాశాలను స్వయంగా సృష్టించుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటుండ‌గా, మరోవైపు అహాన్ పాండేకు ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు య‌ష్ రాజ్ ఫిల్మ్ లాంటి పెద్ద బ్యానర్ సపోర్ట్ కూడా ఉంది.

ఈ నేప‌థ్యంలో ల‌క్ష్య తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకునేందుకు కంటెంట్ ఆధారిత సినిమాలపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. అతను నటించిన కిల్ లాంటి సినిమాలు మ‌రియు ఓటీటీ ప్రాజెక్ట్స్ ద్వారా గుర్తింపు పొందాడు. మ‌రోవైపు అహాన్ పాండే కమర్షియల్ లాంచ్‌తో పాటు హైప్‌ను సంపాదిస్తున్నాడు. అతని ప్రాజెక్ట్ సైయారా చుట్టూ ఏర్పడిన అంచనాలు దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.

కెరీర్ స్ట్రాట‌జీ గేమ్ ప‌రంగా చూసుకుంటే ల‌క్ష్య త‌న కెరీర్ ను చాలా కాలిక్యులేటెడ్ గా ముందుకు తీసుకెళ్తున్నట్లు సమాచారం. అతను ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లాంటి ప్రముఖ బ్యానర్‌తో బాండింగ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పెద్ద ప్రాజెక్ట్స్ కోసం ఆడిషన్స్ ఇవ్వడం, కొత్త అవకాశాల కోసం ప్రయత్నించడం లాంటివి చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఇది స్మార్ట్ స్ట్రాటజీనా లేక పెరుగుతున్న ప్రెజర్ ఫలితమా అన్నది తెలియాల్సి ఉంది.

అంతేకాదు, అహాన్ పాండేకు వెళ్తున్న పాత్రల కోసం ల‌క్ష్య కూడా ట్రై చేస్తున్నాడ‌నే రూమర్స్ ఉన్నాయి. ఇది నిజమైతే, బాలీవుడ్‌లో కొత్త రకమైన పోటీ ప్రారంభమైందని చెప్పవచ్చు. అయితే ఇందులో ఏ మేర‌కు నిజ‌ముంద‌న్న‌ది తెలియాల్సి ఉంది. ఒత్తిడి, అంచ‌నాల ప‌రంగా కూడా ల‌క్ష్య పైనే ప్రెజ‌ర్ ఎక్కువ‌గా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ప్రతీ ప్రాజెక్టుతో త‌న టాలెంట్ ను మ‌ళ్లీ మ‌ళ్లీ ప్రూవ్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి ల‌క్ష్య‌కు ఉంది. మ‌రోవైపు అహాన్ పాండే కు ఉన్న లాంచ్ అడ్వాంటేజ్ తో పాటూ అత‌నికి కొంత టైమ్, స్పేస్ ఎక్కువ‌గా ల‌భిస్తోంది. అయితే వీరి మ‌ధ్య ఉన్న రైవ‌ల్రీ గురించి ఎలాంటి ఆధారాలు లేవు. వీరిద్ద‌రి కెరీర్ ఇంకా ప్రారంభ ద‌శ‌లోనే ఉంది. రాబోయే రోజుల్లో ఈ ఇద్ద‌రూ హీరోలూ త‌మ కెరీర్ ను ఎలా మ‌లుచుకుంటార‌నేద ఆస‌క్తిక‌రంగా మారింది.

Tags:    

Similar News