కిడ్నాప్ కేసులో ఇరుక్కున్న లక్ష్మీ మేనన్.. హీరోయిన్ కి భారీ ఊరట!
ప్రముఖ మలయాళ నటి లక్ష్మీ మేనన్ సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ కెరియర్ పై దృష్టిపెట్టిన ఈమె.. అనూహ్యంగా వార్తల్లో నిలిచింది.;
ప్రముఖ మలయాళ నటి లక్ష్మీ మేనన్ సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ కెరియర్ పై దృష్టిపెట్టిన ఈమె.. అనూహ్యంగా వార్తల్లో నిలిచింది. అది కూడా ఒక ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసిన కేసులో ఇరుక్కోవడం సంచలనంగా మారింది. కిడ్నాప్ కేసులో భాగంగా ఈమె ముగ్గురు స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఈమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని, ఈమె పరారీలో ఉందని పోలీసులు తెలపగా.. తాజాగా ఈమెకు కోర్టులో భారీ ఊరట లభించినట్లు సమాచారం.
అసలు విషయంలోకి వెళ్తే.. కిడ్నాప్ కేసులో భాగంగా లక్ష్మీ మేనన్ స్నేహితులు మిథున్, సోనమోల్, అనీష్ లను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు పోలీసులు. అటు లక్ష్మీ మేనన్ పరారీలో ఉందని పోలీసులు తెలపగా..ఈమె మాత్రం కోర్టుకు వెళ్లి ముందస్తు బయలు తీసుకొని తనకు రక్షణ కల్పించాలని కోరిందట. దీంతో ఈమెకు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. సెప్టెంబర్ 17వ తేదీకి ఈ కేసు విచారణను వాయిదా వేస్తూ ఆమెకు బిగ్ రిలీఫ్ అందించింది. అంతేకాదు అప్పటివరకు ఈమెను అరెస్టు చేయకూడదని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు.
అసలేం జరిగింది అనే విషయానికి వస్తే.. కొచ్చిలోని వెలాసిటీ పబ్ కు లక్ష్మీ మీనన్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి వెళ్లింది. అక్కడే ఐటీ ఉద్యోగితో వీరికి గొడవ జరిగిందట. గొడవ అనంతరం ఆ ఐటీ ఉద్యోగి ఇంటికి వెళ్లే క్రమంలో.. లక్ష్మీ మేనన్ ముగ్గురు స్నేహితులు ఆ ఐటి ఉద్యోగి కారును వెంబడించి, మధ్యలో మధ్యలో ఆపి ఆయనను తమ కారులోకి ఎక్కించుకొని మరీ దాడి చేశారట. అంతటితో ఆగకుండా ఈ విషయం బయటకు పొక్కితే అంత చూస్తామని బెదిరించారట. దాంతో భయపడిపోయిన సదరు ఐటి ఉద్యోగి ఆ ప్రాంత పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి తనకు జరిగిన దాడి గురించి వెల్లడించారట. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు లక్ష్మీ మేనన్ తో పాటూ ఈమె ముగ్గురు స్నేహితులపై కేసు ఫైల్ చేశారు.
ఈ విషయంపై లక్ష్మీ మీనన్ మాట్లాడుతూ.. "ఈ గొడవతో నాకు ఎలాంటి సంబంధం లేదు.. నా పేరును చెడగొట్టి నా పరువు తీయడానికే ఆ ఐటి ఉద్యోగి ఇలా ఆరోపణలు చేస్తున్నారు" అంటూ లక్ష్మీ మేనన్ తెలిపింది. ప్రస్తుతం ఈ కేసులో ఇరుక్కున్న ఈమె ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందో చూడాలి.
లక్ష్మీ మేనన్ సినిమా విషయానికి వస్తే.. 2013లో నా బంగారు తల్లి అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. అటు తెలుగులోనే కాదు ఇటు మలయాళం లో కూడా పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను అలరించిన ఈమె.. చంద్రముఖి 2, ఇంద్రుడు, గజరాజు లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. పలు సినిమాలు చేస్తూ కెరియర్ సాగిస్తున్న ఈమె.. ఇప్పుడు ఇలా ఈ కేసులో ఇరుక్కోవడం హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు.