సన్నీ సినిమా టైటిల్ మార్చేసిన ఆమీర్ ఖాన్
సన్నీకి జోడీగా ప్రీతి జింటా నటిస్తుండగా కీలక పాత్రల్లో శబానా ఆజ్మీ, కరణ్ డియోల్, అలి ఫజల్, అభిమన్యు సింగ్, ఖుషీ హజారే, సందీప్ చటర్జీ తదితరులు నటిస్తున్నారు.;
గదర్ 2 సినిమాతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేసిన బాలీవుడ్ హీరో సన్నీ డియోల్. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి విజయాన్ని సాధించి బ్లాక్‌బస్టర్ అనిపించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.690 కోట్లకు పైనే రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఈ మూవీ అందించిన ఉత్సాహంతో సన్నీ చేసిన మరో సినిమా `జాట్`, `బోర్డర్ 2` చిత్రాలు అదే ఊపుని కొనసాగించాయి. ప్రస్తుతం సన్నీ డియోల్ హను మంతుడిగా `రామాయణ`లో నటిస్తున్నారు.
రణ్‌బీర్ కపూర్ కోదండ రాముడిగా నటిస్తుండగా, సాయి పల్లవి సీతగా కనిపించనుంది. నితేష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ మూవీ గ్లింప్స్ ఇప్పటికే విడుదలై సంచలనాన్ని సృష్టించింది. ఈ ఏడది దీపావళికి ఫస్ట్ పార్ట్‌ని, వచ్చే ఏడాది దీపావళికి పార్ట్ 2ని అత్యంత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వీటితో పాటు సన్నీ డియోల్ నటిస్తున్నభారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా `లాహోర్ 1947`. రాజ్ కుమార్ సంతోషీ దర్శకుడు. ప్రముఖ బాలీవుడ్ స్టార్ ఆమీర్‌ఖాన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
సన్నీకి జోడీగా ప్రీతి జింటా నటిస్తుండగా కీలక పాత్రల్లో శబానా ఆజ్మీ, కరణ్ డియోల్, అలి ఫజల్, అభిమన్యు సింగ్, ఖుషీ హజారే, సందీప్ చటర్జీ తదితరులు నటిస్తున్నారు. 1947లో జరిగిన మతకలహాలు, జిన్నా రాజకీయాలు ఇండియా విభజనకు దారి తీసి పాకిస్థాన్ ఏర్పడలా చేశాయి. అయితే ఆ సమయంలో ఏం జరిగింది? ఎలాంటి మారణ హోమాన్ని సృష్టించారు అనే అంశాలని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టుగా చూపించబోతున్నారు. దేశ చరిత్రలో హిందువులకు మర్చిపోలేని కాలరాత్రిగా నిలిచిన ఈ సంఘటన ఆధారంగా `లాహోర్ 1947`ని నిర్మిస్తున్నారు.
అస్గర్ వజాహట్ రాసిన `జిస్ లాహోర్ నై వెంక్యా ఏ జమ్యాయే నై` అనే నవల ఆధారంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆగస్టు 13న భారీ స్థాయిలో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. జావెద్ అక్తర్ దీనికి సాహిత్యం అందిస్తుండగా, ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాకు టీమ్ టైటిల్‌ని మార్చేసినట్టుగా తెలుస్తోంది. `లాహోర్ 1947 అనే టైటిల్ కాకుండా `బట్వారా 1947` అనే టైటిల్‌ని ఫైనల్ చేశారు. లాహోర్ టైటిల్ కారణంగా సమస్యల్లో చిక్కుకోవడం ఇష్టం లేని మేకర్స్ ఈ మూవీ టైటిల్‌ని `బట్వారా 1947గా మార్చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మేకర్స్ టైటిల్‌ని మార్చేసినట్టుగా ఇన్ ఇన్‌సైడ్‌టాక్.