• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాలీవుడ్ లో లేడీ...

టాలీవుడ్ లో లేడీ ఓరియేంటెడ్ సీక్వెల్ ధ‌మాకా!

| ఈ నేప‌థ్యంలో హిట్ సినిమాల‌కు సీక్వెల్స్ కూడా సౌత్ లో జోరందుకుంటున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-02-15 16:29 GMT

కంటెంట్ ఉంటే క‌టౌట్ తో ప‌నిలేదు. హీరో ఇమేజ్ తో కోట్లు కొల్ల‌గొడుతుందా? హీరోయిన్ ఇమేజ్ తో ఆడుతుందా? అన్న‌ది పాత పాట‌. ఇప్పుడు ఏ సినిమాకైనా కంటెంట్ మాత్ర‌మే కీల‌క పాత్ర పోషిస్తుంది. స‌రైన క‌థా బ‌లంతో సినిమా తీస్తే! ఇమేజ్ తో ప‌నిలేకుండా బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిత్రాలెన్నో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో హిట్ సినిమాల‌కు సీక్వెల్స్ కూడా సౌత్ లో జోరందుకుంటున్నాయి.

టాలీవుడ్ ప‌రంగా చూస్తే హీరోయిన్ ఓరియేంటెడ్ సినిమాల‌కు ఎక్కువ‌గా సీక్వెల్స్ క‌నిపిస్తున్నాయి. ఆ సినిమాల వివ‌రాలు ఓ సారి చూస్తే..స్వీటీ అనుష్క‌తో `భాగ‌మ‌తి` కి సీక్వెల్ రెడీ అవుతోన్న సంగ‌తి తెలి సిందే. ఆశోక్ ఈ సీక్వెల్ ని అనుష్క‌తో తెర‌కెక్కించడానికి రెడీ అవుతున్నారు. `భాగ‌మ‌తి` భారీ విజ‌యం సాధించడంతో న‌యా మేక‌ర్ సీక్వెల్ పై దృష్టి పెడుతున్నారు. అలాగే స‌మంత న‌టించిన `య‌శోద` కి సీక్వెల్ ఉంటుంద‌ని ఆ సినిమా రిలీజ్ స‌మ‌యంలోనే నిర్మాత‌లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

అయితే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ `య‌శోద` ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. అయినా స‌రై `య‌శోద‌-2`కి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ 3 లోనూ న‌టించ‌డానికి సామ్ రెడీ అవుతోంది. ఆ సిరీస్ తో స‌మంత‌కి ద‌క్కిన గుర్తింపుతో మూడ‌వ భాగంలో న‌టించ‌డానికి రెట్టించిన ఉత్సాహంతో ఎదురు చూస్తుం ది. అలాగే తెలుగు హీరోయిన్ అంజ‌లి న‌టించిన `గీతాంజ‌లి`కి కీ కూడా సీక్వెల్ తెర‌కెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈసారి సీక్వెల్ ని ఏకంగా పాన్ ఇండియాలోనే రిలీజ్ చేస్తున్నారు.

యధావిధిగా కోన వెంట‌క్ అంట్ కో చిత్రాన్ని రూపొందిస్తుంది. ఇక ప్రియ‌మ‌ణి `భామాక‌లాపం -2`పై ఇప్ప‌టికే మంచి బ‌జ్ క్రియేట్ అవుతుంది. ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నా ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తు న్నారు. మొద‌టి భాగం `భామాక‌లాపం` మంచి విజ‌యం సాధించ‌డంతో సీక్వెల్ ని రూపొందించారు. మొత్తానికి లేడీ ఓరియేంటెడ్ చిత్రాల సీక్వెల్స్ కూడా టాలీవుడ్ లో జోరందుకున్న‌ట్లే క‌నిపిస్తుంది.

Tags:    
  • Tollywood 
  • Bhaagmathi 
  • Anushka 
  • Samantha 
  • Yashoda 
  • Geetanjali 
  • Anjali 
  • Bhamakalapam2 
  • Priyamani 
  • Konavenkat 

Similar News

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS