• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ హీరో సినిమా 45 కోట్లు...

ఆ హీరో సినిమా 45 కోట్లు పెట్టి తీస్తే 70 వేలు వ‌సూల్!

| అర్జున్ కపూర్ - భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ విడుద‌లైందో లేదో కూడా తెలియ‌కుండా వ‌చ్చి వెళ్లింది. ఈ చిత్రం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.

By - Tupaki Desk
Update: 2024-06-22 02:45 GMT

మహమ్మారి క్రైసిస్ తర్వాత కొన్నాళ్ల పాటు చాలా హిందీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. కరోనావైరస్ ముప్పు.. OTT రంగం విజృంభణ సినిమాల దుర్భరమైన పనితీరుకు కారణమైంది. సూర్యవంశీ, భూల్ భూలయ్యా 2, ది కాశ్మీర్ ఫైల్స్ వంటి మహమ్మారి అనంతర హిందీ చిత్రాలు అనూహ్యంగా మంచి వ‌సూళ్ల‌ను సాధించగా.. ఇటీవలి కాలంలో కూడా చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ 'బడే మియాన్ చోటే మియాన్' భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై డిజాస్ట‌ర్ గా నిలిచింది. అయితే ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన సినిమా ఏదో తెలుసా? ఇది 2023 లో విడుద‌లైన అర్జున్ కపూర్ క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్రం -లేడి కిల్ల‌ర్.

అర్జున్ కపూర్ - భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ విడుద‌లైందో లేదో కూడా తెలియ‌కుండా వ‌చ్చి వెళ్లింది. ఈ చిత్రం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. భారతదేశం అంతటా కేవలం 293 టిక్కెట్లను విక్రయించి మొదటి రోజు రూ. 38,000 మాత్రమే సంపాదించింది. ఇది భారతీయ సినిమా చరిత్రలో అత్యంత దారుణ‌మైన బాక్సాఫీస్ వైఫల్యంగా నిలిచింది. 45 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా ఫైనల్ గ్రాస్ నమ్మశక్యం కానంత త‌క్కువ‌.. దాదాపు 70,000 రూపాయలు సంపాదించింది.

ఈ చిత్రం 3 నవంబర్ 2023న విడుదలైంది. దేశవ్యాప్తంగా కేవలం 12 షోలు మాత్రమే వేసారు. ఖర్చు ఎక్కువ కావడం, ఉత్తరాఖండ్‌లో వర్షం, రీషూట్‌లు కూడా చేయ‌క‌పోవడంతో ఈ సినిమా అసంపూర్తిగా విడుదలైనట్లు సమాచారం. ఫలితంగా నిర్మాణ బృందం అనేక ఎడిటింగ్ కట్‌లు .. వాయిస్ ఓవర్‌లపై ఆధారపడవలసి వచ్చింది. అసంపూర్తిగా ఉన్న షూట్‌లు, వాయిస్‌ఓవర్ లతో విడుద‌లై క్రిటిక్స్, ప్రేక్షకుల నుండి చాలా విమర్శలకు కార‌ణ‌మైంది. అనంత‌రం ఈ చిత్రాన్ని ప్ర‌జ‌లు నిషేధించారు. అయితే అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్, ప్రియాంక బోస్ ల న‌ట‌ ప్రదర్శనలు ప్రశంసలు అందుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద అత్యంత దుర్భరమైన ఫెయిల్యూర్ తర్వాత ఈ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌ల కాబోతోంది.

Tags:    
  • Bollywood 
  • Arjunkapoor 
  • Bhumipednekar 
  • Moviecollections 
  • Crimethriller 
  • Bollywoodmovie 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS