పెద్ది రిలీజ్.. థియేటర్లలో చరణ్ గ్రేస్ ను మ్యాచ్ చేస్తూ లేడీ ఫ్యాన్ రచ్చ!

పెద్ద పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి అంటే చాలు.. ఆయా హీరోల అభిమానులు థియేటర్లలో, థియేటర్ ముందు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

Update: 2026-06-04 09:21 GMT

పెద్ద పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి అంటే చాలు.. ఆయా హీరోల అభిమానులు థియేటర్లలో, థియేటర్ ముందు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా థియేటర్లలో తెరపై తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ సందడి చేస్తుంటే.. వారి గ్రేస్ ను మ్యాచ్ చేస్తూ డాన్స్ పర్ఫామెన్స్ తో అదరగొట్టిన అభిమానులు కూడా లేకపోలేదు. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరో సినిమా దాదాపు ఏడాది నిరీక్షణ తర్వాత తెరపై సందడి చేయడానికి రావడంతో.. ఆ ఆనందాన్ని తట్టుకోలేక ఒక లేడీ అభిమాని థియేటర్లో చేసిన రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానం అంటే ఇది అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

పెద్ది రిలీజ్.. థియేటర్లలో లేడీ ఫ్యాన్ రచ్చ..

అసలు విషయంలోకి వెళ్తే.. రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పెద్ది. నిన్న అనగా జూన్ 3న ప్రీమియర్ షో తో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా పోటీపడ్డారు. ఇకపోతే పెద్ది సినిమా థియేటర్లలో రిలీజ్ అవడంతో అటు అభిమానులు పేపర్లు విసురుతూ డాన్సులు వేస్తూ పండగ చేసుకుంటున్నారు.

రామ్ చరణ్ గ్రేస్ ను మ్యాచ్ చేసిన లేడీ ఫ్యాన్..

ఈ క్రమంలోనే ఒక లేడీ అభిమాని థియేటర్ స్క్రీన్ ముందే చరణ్ అదిరిపోయే స్టెప్పులకు.. అంతే గ్రేస్ తో మ్యాచ్ చేస్తూ ఊర మాస్ లెవెల్లో డాన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండడంతో అదరగొట్టారు అంటూ ఆమెను సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రసంశిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏది ఏమైనా ఆ లేడీ అభిమాని అత్యుత్సాహంతో రైరై రారా అనే పాటకు తెరపై రామ్ చరణ్ స్టెప్పులతో అదరగొడుతుంటే.. ఆయన గ్రేస్ మ్యాచ్ చేస్తూ తెర ముందు ఆ లేడీ అభిమాని చేసిన డాన్స్ స్టెప్స్ విపరీతంగా ఆకట్టుకుంటుంది . అంతేకాదు ఈమె అభిమానాన్ని పక్కన పెడితే ఒక అమ్మాయి అయి ఉండి అంత మంది ముందు డాన్స్ చేయడం పెద్ద సాహసమే అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.

థియేటర్లలో దూసుకుపోతున్న పెద్ది..

వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది మార్చి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను విడుదల చేస్తామని గత ఏడాదే ప్రకటించారు. కానీ కొన్ని కారణాలవల్ల సినిమా వాయిదా పడింది. ఇక ఏప్రిల్ 30వ తేదీన సినిమాను విడుదల చేస్తారని, ఆ తర్వాత జూన్ 26న విడుదల చేస్తారు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేసింది. ఎట్టకేలకు జూన్ 4వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది. ఇందులో కన్నడ సూపర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్, జగపతిబాబు , బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు.



Tags:    

Similar News