రాజ్యసభలో 'ఎంపురాన్' ఇష్యూ.. సురేష్ గోపి ఫుల్ ఫైర్..

రాజ్యసభలో కొందరు సభ్యులు ఎంపురాన్ మూవీ విషయాన్ని లేవనెత్తగా.. మాలీవుడ్ యాక్టర్, కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సురేష్ గోపి మాట్లాడారు.;

Update: 2025-04-04 07:47 GMT

మాలీవుడ్ మూవీ ఎంపురాన్ పై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్ని అభ్యంతరకర సీన్స్ ఉన్నాయంటూ వివాదం చెలరేగగా.. ఆ తర్వాత సెన్సార్ బోర్డు కొన్ని కోతలు విధించింది. ఆ తర్వాత ట్రిమ్ వెర్షన్.. అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఎంపురాన్ మూవీ విషయం.. పార్లమెంట్ కు చేరింది.

రాజ్యసభలో కొందరు సభ్యులు ఎంపురాన్ మూవీ విషయాన్ని లేవనెత్తగా.. మాలీవుడ్ యాక్టర్, కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సురేష్ గోపి మాట్లాడారు. కొన్ని నిమిషాల పాటు మాట్లాడిన ఆయన.. సభను హోరెత్తించారు. అధికార పక్ష సభ్యులు ఆయనను ఎంకరేజ్ చేయగా.. విపక్ష పార్టీల సభ్యులు అడ్డుపడ్డారు. కానీ ఆయన సభను కుదిపేశారు.

ప్రముఖ రాజకీయ నేత టీపీ చంద్రశేఖరన్ జీవితం, ఆయన హత్య నేపథ్యంలో తెరకెక్కిన టీపీ 51 సినిమాను కట్స్ తో రీ రిలీజ్ చేసే దమ్ముందా? ఆయనకు అసలు ధైర్యం ఉందా అంటూ క్వశ్చన్ చేశారు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అనే చిత్రాన్ని కూడా రీ రిలీజ్ చేస్తారా అని అడిగారు. ఆ రెండు చిత్రాలు విడుదల చేసే దమ్ము కేరళ సీఎంకు ఉందా అని అడిగారు.

"ఏదైనా ఆ రెండు సినిమాలు రిలీజ్ చేయాలంటే గట్స్ ఉండాలి. టీపీ 51, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ మూవీలను ఎంపీ బ్రిట్టాస్ గానీ, కైరళీ ఛానెల్‌ గానీ విడుదల చేస్తుందా? కైరళీ ఛానెల్‌ ను ఓ స్టార్ యాక్టర్ నడిపిస్తున్నారు. ఆయన పేరు చెప్పడానికి ఇష్టం లేదు. ఆయన నోబెల్. ఎవరికైనా రిలీజ్ చేసే దమ్ముందా" అంటూ ఆగ్రహంతో మాట్లాడారు.

అయితే సభలో సురేష్ గోపి మాట్లాడుతుంటే.. కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తన భాషలో ఎలాంటి తప్పు లేదని.. స్పీకర్ కు తెలిపారు సురేష్ గోపి. ఎంపురాన్ నిర్మాతలపై ఎవరి నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపారు. తనకు దృష్టికి వివాదం వచ్చినా వెంటనే తాను వారికి కాల్ చేశానని సురేష్ గోపి చెప్పారు.

సినిమాలో తన పేరుతో వేసిన కార్డును తొలగించాలని చెప్పానని, తాను సభలో తప్పుగా మాట్లాడితే ఏ శిక్షకైనా సిద్ధమేనని చెప్పారు. ఎంపురాన్ ముూవీ పేరుతో రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తన పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం సురేష్ గోపి మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మరోవైపు, మోహన్ లాల్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న తర్వాత ఆయన క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని కాంగ్రెస్ ఎంపీ షఫీ పరం బిల్ అన్నారు. ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయకూడదని తెలిపారు. ఎంపురాన్ పై జరిగిన దాడి ప్రజాస్వామ్య సమాజంలో భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి ఆందోళనలను లేవనెత్తుతుందని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News