కన్నడ ప్రొడక్షన్ చేతికి మెగా కాంబో!
తాజాగా మెగాస్టార్ చిరంజీవితో ఓ కొత్త సినిమా కోసం KVN ముందుకొచ్చినట్లు సమాచారం, ఇది టాలీవుడ్‌లో ఆసక్తి రేకెత్తిస్తోంది.;
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న KVN ప్రొడక్షన్స్, ఇప్పుడు టాలీవుడ్‌లోనూ సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. బెంగళూరు కేంద్రంగా 2020లో వెంకట్ కె. నారాయణ, నీషా వెంకట్ కొనంకి స్థాపించిన KVN, కన్నడ సినిమాలతో పాటు పాన్ ఇండియా ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. డిస్ట్రిబ్యూషన్ లో కూడా సంస్థకు మంచి పేరుంది. ‘సఖత్’, ‘బైటు లవ్’ సినిమాలతో మొదలైన KVN, ఇప్పుడు యశ్ ‘టాక్సిక్’, విజయ్ ‘జననాయకన్’ లాంటి భారీ ప్రాజెక్టులతో సిద్ధమవుతోంది.
తాజాగా మెగాస్టార్ చిరంజీవితో ఓ కొత్త సినిమా కోసం KVN ముందుకొచ్చినట్లు సమాచారం, ఇది టాలీవుడ్‌లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక ఆ సినిమాకు దర్శకుడు మరెవరో కాదు.. వాల్తేరు వీరయ్యా తో మెగాస్టార్ కు మంచి సక్సెస్ ఇచ్చిన బాబీ. అతను ‘డాకూ మహరాజ్’ తర్వాత వెంటనే మరో సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు, కానీ హీరోల డేట్స్ దొరకకపోవడంతో ఆ ప్లాన్ వర్కవుట్ కాలేదు.
బాలకృష్ణ ఇప్పటికే రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు, ‘డాకూ మహరాజ్’ సైతం ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో బాబీకి చిరంజీవి మాత్రమే ఆప్షన్‌గా మిగిలారు. చిరంజీవి కూడా ఈ కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది, కానీ నిర్మాతలు సిద్ధంగా లేరని వార్తలు వచ్చాయి. ఎందుకంటే బాబీ మాస్ కంటెంట్ కమర్షియల్ సినిమాలకు గట్టిగానే ఖర్చు చేయిస్తాడు అనే టాక్ ఉంది. ఇక సినిమాలు భారీ బడ్జెట్‌తో తీస్తారని, ఖర్చులు అదుపు చేయడం కష్టమని. ‘డాకూ మహరాజ్’ సినిమా కూడా నాన్ థియేట్రికల్ ఆదాయంతో నిర్మాతకు లాభాలను అందించింది, కానీ థియేటర్లలో అంతగా ఆడలేదనే కామెంట్స్ వచ్చాయి.
ఇక నిర్మాత దొరకడం కష్టమవుతున్న క్రమంలో KVN ఎంట్రీ ఇచ్చింది. ఈ సంస్థ ఎప్పటి నుంచో టాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తోంది, ఇప్పటికే చాలా మంది హీరోలకు అడ్వాన్స్‌లు ఇచ్చింది. చిరంజీవి దగ్గర కూడా సంస్థ అడ్వాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు KVN, బాబీ మధ్య ఓ డీల్ కుదిరినట్లు సమాచారం, ఇది ఈ కాంబినేషన్‌ను ఫైనల్ చేసే దిశగా అడుగులు వేస్తోంది.
ప్రస్తుతం చిరంజీవి విదేశాల్లో ఉన్నారు, ఆయన తిరిగి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ చర్చలు సానుకూలంగా ముగిస్తే, ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. KVN సపోర్ట్‌తో ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందే అవకాశం ఉంది. మొత్తంగా, KVN ప్రొడక్షన్స్ ఎంట్రీతో చిరంజీవి, బాబీ కాంబినేషన్ ఫైనల్ అయితే, ఈ సినిమా అభిమానులకు ఓ విజువల్ ట్రీట్‌గా నిలిచే అవకాశం ఉంది. మరి ఈ మెగా కాంబో ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.