• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బ్లాక్ డ్రెస్ టు బ్లాక్...

బ్లాక్ డ్రెస్ టు బ్లాక్ శారీ.. ఖుషిత హై గ్లామర్ డోస్

| తాజాగా ఖుషితా కల్లపు పోస్ట్ చేసిన ట్రాన్సిషన్ వీడియో తెగ ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ ఫేమస్ సాంగ్ చమ్మక్ ఛల్లో సాంగ్ మ్యూజిక్ కు తన ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టింది.

By - Tupaki Desk
Update: 2023-12-19 09:30 GMT

యూట్యూబర్ ఖుషితా కల్లపు అంటే చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు. కానీ బజ్జీల పాప అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. అప్పుడెప్పుడో ఓ పబ్ మీద దాడి జరిగినప్పుడు ఇక్కడికి ఎందుకొచ్చారని అడిగితే.. ఛీజ్ బజ్జీలు తినడానికి వచ్చినట్లు చెప్పింది. ఇక అప్పటి నుంచి అటు సోషల్ మీడియాతోపాటు ఇటు సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. షార్ట్ ఫిల్మ్, రీల్స్ తో ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. పబ్ ఘటన నుంచి బజ్జీల పాపగా మారిపోయింది.

సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీని క్యాష్ చేసుకునేందుకు ట్రై చేస్తోంది ఈ అమ్మడు. షార్ట్ ఫిల్మ్స్ మానేసి సినిమాల్లో నటించడం ప్రారంభించింది. మెయిన్ హీరోయిన్ గా చాంగురే బంగారు రాజా, మనోహరం, నీతోనే నేను సినిమాల్లో నటించింది. గోపీచంద్ రామబాణంలో కూడా చిన్న పాత్రలో యాక్ట్ చేసింది.

ఆ తర్వాత సంక్రాంతి రేసులో ఉన్న మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఖుషిత. ఈ విషయాన్ని సినిమా యూనిట్ చెప్పకపోయినా ఆమెనే ఓ పోస్ట్ ద్వారా తెలిపింది. మేకప్ రూమ్ లో రెండు జడలు వేసుకుని రెడీ అయిన పిక్స్ షేర్ చేసింది. ఆ పోస్ట్ కు హ్యాష్ ట్యాగ్ SSMB28 అని పెట్టింది. ఈ పోస్టుతోనే ఖుషితకు గుంటూరు కారం సినిమాలో ఛాన్స్ వచ్చిందని క్లారిటీ వచ్చింది. కెరీర్ స్టార్టింగ్ లో ఉన్న ఖుషితకు ఇది మంచి ఛాన్స్ అని చాలా మంది తెలిపారు.

మరోవైపు, సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్లను పెంచుకునేందుకు తెగ ట్రై చేస్తోంది ఈ బ్యూటీ. తన ఫ్యాన్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో డైలీ అప్డేట్స్ ఇస్తూ తెగ ఖుషీ చేస్తుంటుంది.

తాజాగా ఖుషితా కల్లపు పోస్ట్ చేసిన ట్రాన్సిషన్ వీడియో తెగ ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ ఫేమస్ సాంగ్ చమ్మక్ ఛల్లో సాంగ్ మ్యూజిక్ కు తన ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టింది. బ్లాక్ డ్రెస్ నుంచి సెకన్లలో బ్లాక్ శారీ మారుతూ గ్లామరస్ లుక్స్ తో ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ వీడియోకు ఫ్యాన్స్ లైకులు, కామెంట్లతో ముంచెత్తుతున్నారు. మరి గుంటూరు కారంతో ఈ అమ్మడు హిట్ కొడుతుందో లేదో చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Youtuber 
  • Actress 
  • Kushithakallapu 
  • Actresskushitha 
  • Socialmedia 
  • Video 
  • Blacksaree 
  • Transitionvideos 

Similar News

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

Copyright @2026

Powered by Blink CMS