టాప్ స్టార్స్‌తో రష్మిక సెల్ఫీ వైరల్
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేర సినిమాను జూన్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు;

నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం 'కుబేర' సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేర సినిమాను జూన్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ధనుష్ తో పాటు ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాను రూపొందించాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఈమధ్య కాలంలో ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమాలు రాలేదు అంటూ మేకర్స్ బలంగా చెబుతున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ అందుకున్నాడు.

నాగార్జున మొన్నటి వరకు కొడుకు అఖిల్ అక్కినేని పెళ్లి పనులతో బిజీగా గడిపారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించడంతో పాటు, ఇతర పెళ్లి పనుల కారణంగా నాగార్జున కుబేర ప్రమోషన్స్‌కి దూరంగా ఉన్నారు. ఎట్టకేలకు అఖిల్ వివాహ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఇటీవలే రిసెప్షన్ కూడా పూర్తి అయింది. పెళ్లి అయిన వెంటనే నాగార్జున తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశాడు. సినిమా షూటింగ్ పూర్తి కావడంతో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సైతం పూర్తి అయింది. దాంతో యూనిట్ సభ్యులు అంతా కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కుబేర సినిమా ఆడియో విడుదల కార్యక్రమంను చెన్నైలో భారీ ఎత్తున నిర్వహించారు.
సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు హైదరాబాద్ టు చెన్నై తిరుగుతూనే ఉన్నారు. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన అనుపమ్ ఖేర్ సైతం ప్రమోషన్‌లో పాల్గొంటున్నారు. తాజాగా రష్మిక మందన్న షేర్ చేసిన సెల్ఫీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నాగార్జున, అనుపమ్ ఖేర్‌లతో విమానంలో ప్రయాణిస్తున్నట్లుగా ఉన్న ఆ ఫోటో వైరల్ అయింది. ఈ ఫోటోకు కొన్ని ప్రయాణాలు చాలా స్పెషల్‌గా నిలుస్తూ ఉంటాయి. నాకు ఈ ప్రయాణం ఎంతో గొప్పది అంటూ లవ్ ఈమోజీలను షేర్ చేయడం ద్వారా నాగార్జున, అనుపమ్ ఖేర్‌లపై తన గౌరవంను చాటుకుంది. రష్మిక కుబేర సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది.
ఈ ఏడాదిలో ఈమె నటించిన 'ఛావా' సినిమాతో పాటు సికిందర్ సినిమాలు వచ్చాయి. ఛావా సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో రష్మిక పోషించిన యేసు బాయి పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఇక సికిందర్ సినిమా వల్ల రష్మిక చాలా విమర్శలు ఎదుర్కొంది. సల్మాన్ వంటి సీనియర్ హీరోకు జోడీగా నటించడం పెద్ద తప్పు అయితే, కథ వినకుండా, పాత్ర తెలియకుండా ఎలా కమిట్ అయ్యావు అంటూ చాలా మంది ఆమెను తీవ్ర పదజాలంతో విమర్శించారు. సికిందర్ సినిమా ఫలితం నుంచి బయట పడాలి అంటే రష్మిక మందన్నకి ఈ ఏడాదిలో మరో విజయం దక్కాలి. అది కుబేర రూపంలో రావాలని ఆమె కోరుకుంటుంది.