కుబేర మూవీ.. రష్మిక, దేవిశ్రీ ఏమన్నారంటే?
అయితే మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయగా ట్రైలర్ ను దర్శకుడు రాజమౌళి రిలీజ్ చేశారు.;

పాన్ ఇండియా మూవీ కుబేర రిలీజ్ కు మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా కుబేర.. థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు ఉండగా.. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ వాటిని మరింత పెంచింది.
అయితే మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయగా ట్రైలర్ ను దర్శకుడు రాజమౌళి రిలీజ్ చేశారు. వేడుకకు సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ పోషించిన రష్మికతోపాటు మ్యూజిక్ అందించిన దేవి శ్రీ ప్రసాద్ వచ్చారు. సినిమాను ఉద్దేశించి వారిద్దరూ వేదికపై మాట్లాడారు. అందుకు సంబంధించిన వీడియోస్ వైరల్ అవుతున్నాయి.
"కుబేర నాకు గొప్ప అవకాశం. నాకు శేఖర్ గారితో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అది నెరవేరింది. అందుకే కుబేరను లక్ గా భావిస్తున్నాను. మూవీలో నేను చేసిన క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని నమ్ముతున్నా. సినిమా కోసం అంతా చాలా కష్టపడ్డారు. మూవీ టీమ్ అందరికీ థ్యాంక్యూ" అని రష్మిక చెప్పారు.
"నాగార్జున గారితో రెండోసారి వర్క్ చేయడం చాలా హ్యాపీ. ధనుష్ గారితో వర్క్ చేయడం ఇదే ఫస్ట్ టైం. మా కెమిస్ట్రీ చూసి మంచి ఆఫర్స్ వస్తాయని అనుకుంటున్నా. ఆయనతో మరోసారి కలిసి పనిచేయాలని వెయిట్ చేస్తున్నా. నిర్మాతలు చాలా బడ్జెట్ పెట్టి అద్భుతంగా నిర్మించారు. మూవీ మంచి సక్సెస్ అవ్వాలి" అంటూ నేషనల్ క్రష్ ఆకాంక్షించారు.
ఆ తర్వాత కుబేర చాలా స్పెషల్ ఫిల్మ్ అని దేవి శ్రీ ప్రసాద్ అన్నారు. "మూవీ గురించి ఎంత మాట్లాడిన తక్కువ అనిపిస్తుంది. శేఖర్ గారితో ఎప్పటినుంచో వర్క్ చేయాలనుకున్నా.. ఫైనల్ గా కుబేరతో అది కుదరడం ఆనందంగా ఉంది. అద్భుతమైన స్క్రిప్ట్ రాశారు. ఇలాంటి కథను ఇంతకుముందు మనం ఎప్పుడు చూసి ఉండం. సినిమాలో ప్రతి మూమెంట్ ను ఎంజాయ్ చేస్తారు" అని డీఎస్పీ తెలిపారు.
"సినిమాలో రష్మిక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ధనుష్ గారు అద్భుతంగా చేశారు. ఆయనను స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నాకు సర్ప్రైజ్ అనిపించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు ఒక క్యారెక్టర్ గా కనిపించారు. సినిమాలోని ఆ క్యారెక్టర్ నాగార్జున గారు చేయకపోతే ఇంకా ఎవరితో చేసేవారో ఊహకు అందడం లేదు. కుబేరలో పార్ట్ కావడం చాలా గౌరవంగా భావిస్తున్నా" అని దేవిశ్రీ చెప్పారు.