ధనుష్ ఎలా రియాక్ట్ అవుతాడో అని టెన్షన్ పడ్డా
ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా కుబేర. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.;

ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా కుబేర. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలున్నాయి. ఆ అంచనాలను రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ ఇంకాస్త పెంచింది. జూన్ 20న కుబేర సినిమా రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున, శేఖర్ కమ్ముల కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా గురించి, కుబేర కు పని చేసిన అనుభవం గురించి మాట్లాడారు. ధనుష్ హీరోగానే కాదు, అన్ని విషయాల్లోనూ అతనికి మంచి టాలెంట్ ఉందని, అతను మల్టీ టాలెంటెడ్ అని శేఖర్ కమ్ముల చెప్పారు.
ధనుష్ కూడా డైరెక్టర్ అవడంతో రీటేక్ అడిగినా, ఇంకేమైనా చెప్పినా దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అని కుబేర షూటింగ్ కు ముందు టెన్షన్ పడ్డానని, కానీ ధనుష్ సింగిల్ టేక్ లోనే సీన్ ను చేసేసే వాడని, నాగార్జునతో ఆల్రెడీ పరిచయముంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ చేశానని శేఖర్ చెప్పారు. జిమ్ ఇంగ్లీష్ లోనే మాట్లాడతాడు. అయినప్పటికీ ఫస్ట్ సీన్ లోనే తెలుగు, తమిళ డైలాగులు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడని, సినిమాలో రష్మిక చాలా స్పెషల్ రోల్ లో కనిపిస్తుందని, కుబేర కోసం క్యారెక్టర్లు డిమాండ్ చేసిన నటీనటులనే తాను సెలెక్ట్ చేశానని, అసలు ఈ కథను సినిమాగా చేయాలనే ఆలోచన రావడమే తన అదృష్టంగా భావిస్తున్నట్టు శేఖర్ కమ్ముల పేర్కొన్నారు.
తాను చేసే ప్రతి సినిమాలో కొత్తదనం ఉండేలా చూసుకుంటానని, గత రెండు మూడేళ్లుగా ఎలాంటి క్యారెక్టర్లు చేయాలనే విషయంలో తాను కన్‌ఫ్యూజన్ లో ఉన్నానని, అలాంటి టైమ్ లోనే తన వద్దకు కుబేర వచ్చిందని, కథ, పాత్ర నచ్చితే నిడివితో సంబంధం లేకుండా సినిమా చేస్తానని నాగార్జున తెలిపాడు. బాక్సాఫీస్ నెంబర్లను పెద్దగా పట్టించుకోనని, అవెప్పుడూ శాశ్వతం కాదని, ఎప్పటికప్పుడు ఆ నెంబర్లు, రికార్డులు మారుతూనే ఉంటాయని నాగార్జున చెప్పాడు. ఈ సందర్భంగానే తాను కూలీ సినిమాలో సైమన్ అనే విలన్ పాత్ర చేస్తున్న విషయాన్ని కూడా నాగార్జున వెల్లడించాడు. కూలీలో తాను విలన్ అయినప్పటికీ తనను డైరెక్టర్ లోకేష్ ఎంతో అందంగా చూపించాడని నాగ్ అన్నారు.