సాఫ్ట్ అండ్ పొయెటిక్ శేఖర్ కమ్ముల కుబేర ఎలా తీశాడు..?

ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కుబేర. సునీల్ నారంగ్ నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.;

Update: 2025-06-19 12:43 GMT
సాఫ్ట్ అండ్ పొయెటిక్ శేఖర్ కమ్ముల కుబేర ఎలా తీశాడు..?

ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కుబేర. సునీల్ నారంగ్ నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. టీజర్, ట్రైలర్ కుబేర సినిమా పై భారీ అంచనాలు ఏర్పరిచాయి. ఇన్నాళ్లు సెన్సిబుల్ సినిమాలు చేస్తూ తన ప్రతిభతో మెప్పించిన శేఖర్ కమ్ముల మొదటిసారి తన పంథా మార్చి చేసిన ప్రయత్నమే కుబేర.

కుబేర రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా కింగ్ నాగార్జున, డైరెక్టర్ శేఖర్ కమ్ములను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశాడు మన యువ సామ్రాట్ నాగ చైతన్య. శేఖర్ కమ్ములతో లవ్ స్టోరీ సినిమా చేసిన చైతు ఆ సినిమాతో సక్సెస్ అందుకున్నారు. శేఖర్ కమ్ములతో పనిచేయడం అంటే ఒక వర్క్ షాప్ లాంటిదని అన్న నాగ చైతన్య ఆయనతో పనిచేసినప్పుడు ఒక యాక్టర్ కొత్తగా బయటకు వస్తామని అన్నారు. ఇన్నేళ్లుగ్సా ఏం నేర్చుకున్నామో అవన్నీ మర్చిపోయి ఫ్రెష్ గా కనిపిస్తామని అన్నారు నాగ చైతన్య.

ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా శేఖర్ కమ్ముల గారంటే సాఫ్ట్, పొయెటిక్, హ్యూమన్ ఎమోషన్స్ ఇలాంటి నరేషన్స్ చూశాం.. కానీ కుబేర ట్రాన్స్ ఫర్మేషన్ వచ్చినప్పుడు చూస్తే కంప్లీట్ గా మీరే మీ స్టైల్ ని బ్రేక్ చేసి కొత్త ప్రజంటేషన్ తో వచ్చారనిపించింది. అది ఎలా సాధ్యమైందని నాగ చైతన్య అన్నారు. అది ఎప్పటి నుంచో ఆ థాట్ ఉందా.. లేదా లవ్ స్టోరీ తర్వాత వచ్చిందా అన్నారు.. దానికి శేఖర్ కమ్ముల సమాధానం ఇస్తూ స్టోరీ కాల్డ్ ఫర్ దట్.. ఆ కథే అలా తీయాలని ప్రేపేపించిందని చెప్పారు.

శేఖర్ కమ్ముల చేసిన ఈ ప్రయత్నం అతని అసలు టాలెంట్ ని చాటి చెప్పేలా ఉంది. లీడర్ సినిమాతోనే సమాజం మీద తనకున్న దృక్పథాన్ని చెప్పిన శేఖర్ కమ్ముల కుబేర కథ రాయడం.. దానికి మంచి నటులను తీసుకోవడం వల్ల ప్రాజెక్ట్ అనుకున్న దానికన్నా చాల బాగా వచ్చింది. కుబేర మీ అందరి ఆలోచనలను మార్చేస్తుంది అని శేఖర్ కమ్ముల ఇంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు అంటే సినిమా కోసం ఆయన చేసిన హార్డ్ వర్క్ ఎలాంటిదో అర్ధమవుతుంది.

నాగ చైతన్యతో కుబేర స్పెషల్ ఇంటర్వ్యూ అక్కినేని ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అందిస్తుంది. ఈ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల స్పెషల్ క్వాలిటీస్ గురిచి అటు నాగార్జున, ఇటు నాగ చైతన్య ఆడియన్స్ తో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం కుబేర కోసం నాగ చన్య స్పెషల్ ఇంటర్వ్యూ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News