• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సౌత్ ఇండస్ట్రీపైనే అమ్మడి...

సౌత్ ఇండస్ట్రీపైనే అమ్మడి గురి..?

| సౌత్ కన్నా బాలీవుడ్ బెస్ట్ అనుకున్న కృతి సనన్ అక్కడ మొదట్లో పెద్దగా అవకాశాలు రాబట్టలేకపోయినా తర్వాత తర్వాత అవకాశాలు అందుకుంది.

By - Tupaki Desk
Update: 2024-05-30 03:15 GMT

మోడల్ గా చేసి ఆ క్రేజ్ తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతి సనన్ మొదటి సినిమానే సూపర్ స్టార్ మహేష్ తో 1 నేనొక్కడినే సినిమా తో క్రేజీ ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా హిట్ అయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ అది ఫలితం తేడా కొట్టడంతో అమ్మడికి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే నేనొక్కడినే తర్వాత బాలీవుడ్ లో హీరో పంటి చేసిన కృతి అక్కడ క్రేజ్ తెచ్చుకుంది. నాగ చైతన్యతో దోచెయ్ అంటూ మరో అటెంప్ట్ చేసినా వర్క్ అవుట్ కాలేదు. సౌత్ కన్నా బాలీవుడ్ బెస్ట్ అనుకున్న కృతి సనన్ అక్కడ మొదట్లో పెద్దగా అవకాశాలు రాబట్టలేకపోయినా తర్వాత తర్వాత అవకాశాలు అందుకుంది.

కెరీర్ లో ఒక్కో అడుగు వేసుకుంటూ వచ్చిన కృతి సనన్ బాలీవుడ్ లో ఇప్పుడు వన్ ఆఫ్ ది క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. రీసెంట్ గా క్రూ తో మంచి మరో సక్సెస్ అందుకున్న కృతి ఆ సినిమాలో కరీనా కపూర్, టబులతో కలిసి సత్తా చాటింది. తెలుగులో రెండు సినిమాలు చేసిన అమ్మడు ఇక్కడ మొదట్లో లక్ కలిసి రాలేదు కాబట్టి ఇప్పుడు మళ్లీ ఇక్కడ ఛాన్స్ వస్తే తన సత్తా చాటుతా అంటుంది. రీసెంట్ ఇంటర్వ్యూలో సౌత్ సినిమాలపై తన అభిమానం తెలిపింది కృతి సనన్.

ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలు చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న కారణంగా కృతి సనన్ కి మళ్లీ టాలీవుడ్ వైపు గాలి మళ్లింది. అయితే తెలుగులో చేసిన రెండు సినిమాలు బెటర్ రిజల్ట్ ఇవ్వలేదు కాబట్టే కృతికి మళ్లీ తెలుగులో ఛాన్సులు రాలేదని చెప్పొచ్చు. అయితే కృతి సనన్ మాత్రం తెలుగులో అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని అంటుంది.

డైరెక్ట్ గా తెలుగు సినిమా ఈమధ్యలో చేయలేదు కానీ తెలుగు హీరో ప్రభాస్ తో ఆదిపురుష్ లో నటించింది కృతి సనన్. ఆ సినిమా టైం లో ప్రభాస్ కి ఆమెను లింక్ చేస్తూ చాలా వార్తలు వచ్చాయి. ప్రభాస్ కృతి సనన్ ని పెళ్లాడతాడని హడావిడి చేశారు. కానీ అదంతా మధ్యలో వాళ్ల సృష్టి అని తర్వాత తెలిసింది. కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ లో డూ పట్టి సినిమా చేస్తుంది. ఈ సినిమాలో ఆమె నటించడమే కాదు నిర్మాతగా కూడా వ్యవహరిస్తుంది కృతి సనన్.

Tags:    
  • Bollywood 
  • Tollywood 
  • FilmIndustry 
  • TheCrew 
  • Adipursh 
  • TeriBaatonMeinAisaUljhaJiya 
  • KritiSanon 
  • Prabhas 
  • KareenaKapoor 
  • Tabu 

Similar News

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

Copyright @2026

Powered by Blink CMS