పిక్ టాక్ : క్లోజప్‌ లో అందాల కృతి బేబీ

ఈ సారి క్లోజప్‌ లో ఉన్న తన పిక్ ను షేర్‌ చేసింది. కూల్‌ లుక్ లో ఏదో చదువుతూ ఫోటోకు ఫోజ్ ఇచ్చింది. అందాల కృతి భలే ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Update: 2024-05-04 02:30 GMT

మోడలింగ్ నుంచి సినిమా రంగంలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ కృతి సనన్‌. ఈ అమ్మడు తెలుగు లో మొదటగా మహేష్ బాబుకు జోడీగా 1 నేనొక్కడినే సినిమాలో నటించింది. సుకుమార్‌ ఈ అమ్మడి పై చాలా నమ్మకం పెట్టుకుని సినిమాలో నటింపజేశాడు. ఆయన అంచనాలను కృతి అందుకుంది.

 

ఆ సినిమా కమర్షియల్‌ గా నిరాశ పర్చడంతో ఆ తర్వాత ఎక్కువగా తెలుగు లో సినిమాల్లో ఆఫర్లు రాలేదు. దాంతో బాలీవుడ్‌ లో ఈ అమ్మడు ప్రయత్నాలు చేసింది. హిందీ ప్రేక్షకులు ఈ అమ్మడికి బ్రహ్మరథం పట్టారు. వరుసగా హిందీలో సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్‌ ని కలిగి ఉన్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేసింది.

ఈసారి క్లోజప్‌ లో ఉన్న తన పిక్ ను షేర్‌ చేసింది. కూల్‌ లుక్ లో ఏదో చదువుతూ ఫోటోకు ఫోజ్ ఇచ్చింది. అందాల కృతి భలే ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఆ మధ్య ఈ అమ్మడు ఒక తెలుగు సినిమాలో ఐటెం సాంగ్‌ చేయబోతుందనే వార్తలు వచ్చాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

Tags:    

Similar News