ఆ సినిమా కోసం చెల్లిని రికమండ్ చేస్తోందా?
మరి పర్హాన్ అక్తర్ గనుక 'డాన్ 3' సెకెండ్ లీడ్ కి నుపుర్ సనన్ ని ఎంపిక చేస్తే ఆమె పంట పండినట్లే. బాలీవుడ్ లో సరైన ఛాన్సుల కోసం నుపుర్ చాలా కాలంగా పోరాటం చేస్తుంది.;

'డాన్' ప్రాంచైజీ నుంచి 'డాన్ 3' కి రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందులో హీరోగా రణవీర్ సింగ్ ఫైనల్ అయ్యాడు. హీరోయిన్ గా తొలుత కియారా అద్వాణీని తీసుకున్నా? ఆమె ఎగ్జిట్ అవ్వ డంతో ఆ స్థానంలో కృతిసనన్ భర్తీ చేస్తోంది. అయితే ఇదే సినిమాలో సెకెండ్ లీడ్ కూడా ఉందిట. ఆ పాత్ర కోసం తన సోదరి నుపుర్ సనన్ తీసుకోవాల్సిందిగా కోరుతుందిట. ఈ మాట నేరుగా కృతి డైరెక్టర్ కి చెప్ప కుండా రణవీర్ సింగ్ ద్వారా విషయం ఫర్హాన్ అక్తర్ చెవిన వేసిందిట.
దీంతో పర్హాన్ కూడా ఆలోచించి చెబుతానన్నాడుట. నుపుర్ ను గనుక ఎంపిక చేస్తే ఇండస్ట్రీలో రికమం డీషన్లు పనిచేస్తున్నట్లే. సాధారణంగా ఇలాంటి రికమండీషన్లు ఎవరూ చేయరు. డైరెక్టర్ హీరోయిన్ల ఎంపిక విషయంలో ఏమాత్రం రాజీ పడరు. తాను రాసుకున్న పాత్రకు ఎవరైతే సెట్ అవుతారో వాళ్లనే తీసుకుం టారు. చిన్న చిన్న పాత్రల విషయంలో రాజీ పడే అవకాశం ఉంటుందేమో గానీ నాయికల పాత్రల విషయంలో కాంప్రమైజ్ ఉండదు.
మరి పర్హాన్ అక్తర్ గనుక 'డాన్ 3' సెకెండ్ లీడ్ కి నుపుర్ సనన్ ని ఎంపిక చేస్తే ఆమె పంట పండినట్లే. బాలీవుడ్ లో సరైన ఛాన్సుల కోసం నుపుర్ చాలా కాలంగా పోరాటం చేస్తుంది. కానీ ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదు. దీంతో ఇన్ స్టాకే పరిమితమవుతుంది. హిందీలో ఒక్క సినిమా మాత్రమే చేసింది. పలు టీవీ షోలు..మ్యూజిక్ వీడియోలు చేసింది. ఈ అమ్మడు తెలుగు తెరకు పరిచయమే.
మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' లో నటించింది. ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో నుపుర్ ఎఫెర్ట్ కూడా వృద్ధా అయింది. దీంతో తెలుగులో అవకాశాలు రాలేదు. ఇన్ స్టాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది . హాట్ హాట్ ఫోటోలతో ఎటాక్ చేస్తుంటుంది. అప్పుడుప్పడు అక్క కృతి సనన్ కూడా తోడవుతుంది.