రూ.80 కోట్లతో... హీరోయిన్ కృతి రికార్డ్!
బాలీవుడ్ స్టార్స్ ఎక్కువగా రియల్ ఎస్టేట్ పై పెట్టుబడులు పెడుతూ ఉంటారు. పదుల కోట్లు ఖర్చు చేసి ఖరీదైన విల్లాలు, అపార్ట్‌మెంట్‌లను కొనుగోలు చేయడం మనం చూస్తూ ఉంటాం;
బాలీవుడ్ స్టార్స్ ఎక్కువగా రియల్ ఎస్టేట్ పై పెట్టుబడులు పెడుతూ ఉంటారు. పదుల కోట్లు ఖర్చు చేసి ఖరీదైన విల్లాలు, అపార్ట్‌మెంట్‌లను కొనుగోలు చేయడం మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా సముద్రం ఫేసింగ్‌తో ఉన్న అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్స్ ను కొనుగోలు చేసేందుకు స్టార్స్ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముంభైలోని ఖరీదైన ఏరియాల్లో హీరోలు, హీరోయిన్స్ పదుల కోట్లు ఖర్చు చేసి ఇండిపెండెంట్ హౌస్ లేదా అపార్ట్‌మెంట్ ఫ్లాట్ కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా ఎంతో మంది స్టార్స్ తమ స్టార్ స్టేటస్‌కి తగ్గట్లుగా ఖరీదైన ఇళ్లను కొనుగోలు చేస్తూనే ఉన్నారు. ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు ముంబైలోని పాలిహిల్ లో ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆ ఖరీదైన ఏరియాలో హీరోయిన్ కృతి సనన్ ఇల్లు కొనుగోలు చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమయంలో వరుసగా నిరాశను చవిచూసిన కృతి సనన్ ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్‌గా దూసుకు పోతుంది. నేషనల్ అవార్డ్‌ను సొంతం చేసుకున్న ఈ అమ్మడు మరిన్ని సినిమాల్లో నటిస్తూ స్టార్‌డం దక్కించుకుంది. సినిమాకు దాదాపు రూ.10 కోట్లకు మించి పారితోషికంను ఈ అమ్మడు తీసుకుంటూ ఉంది. బాలీవుడ్‌లో మోస్ట్ బిజీ హీరోయిన్‌గా ఈ అమ్మడు వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ఆకట్టుకునే అందంతో పాటు, నటిగా మంచి ప్రతిభ ఉన్న ఈ అమ్మడికి బాలీవుడ్ స్టార్స్ నుంచి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ముందు ముందు సౌత్‌లో ఈమె మరిన్ని సినిమాలు చేసేందుకు రెడీ అన్నట్లుగా వెయిట్ చేస్తుంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం కావడంతో ఎక్కువగా సినిమా ఆఫర్లు ఈ అమ్మడి తలుపు తడుతున్నాయి.
రూ.78.20 కోట్లతో కృతి సనన్ ఇల్లు
ఇక ఈమె తీసుకున్న ఖరీదైన అపార్ట్‌మెంట్ ఫ్లాట్ గురించి బాలీవుడ్ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. కృతి సనన్ కొనుగోలు చేసిన ఫ్లాట్ ఖరీదు రూ.78.20 కోట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా రూ.4 కోట్ల వరకు స్టాంప్‌డ్యూటీ చెల్లించిందని తెలుస్తోంది. మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఫ్లాట్ ఖరీదు 78 కోట్ల రూపాయలని తెలుస్తోంది. అయితే బహిరంగ మార్కెట్లో దాని ఖరీదు దాదాపుగా డబుల్ ఉంటుందని, స్టాంప్ డ్యూటీని తగ్గించుకోవడం కోసం వ్యాల్యూని తగ్గించి ఉంటారు అనేది కొందరి మాట. మొత్తానికి ఇండస్ట్రీలో మరే హీరోయిన్‌కి లేని అత్యంత ఖరీదైన ఇల్లు కృతి సనన్‌కి ఉంది అంటూ బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన విశేషాల గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.
బాలీవుడ్‌లోనే అరుదైన రికార్డ్
సముద్రం వైపు ఉండే ఈ డ్యూప్లెక్స్ పెంట్ హౌస్‌ను కృతి కొనుగోలు చేసింది. 14, 15 అంతస్తుల్లో ఉండే ఈ డ్యూప్లెక్స్ కోసం ప్రత్యేకమైన లిఫ్ట్‌తో పాటు ఆరు పార్కింగ్ స్లాట్స్ ను కేటాయించారు. మొత్తం ఈ పెంట్ హౌస్ 6636 చదరపు అడుగల విస్తీర్ణంలో ఉంది. ఓపెన్ టెర్రస్ విశాలంగా ఉంటుందని అంటారు. ఒక్క చదరపు అడుగుకు రూ.1.18 లక్షల ధరతో ఈ అపార్ట్‌మెంట్‌ను కృతి సనన్ కొనుగోలు చేసింది. ఈ మధ్య కాలంలో లక్షకు పైగా చదరపు అడుగుల విస్తీర్ణం కు ఖర్చు చేసిన హీరోయిన్ కృతి సనన్ మాత్రమే అంటూ బాలీవుడ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బాలీవుడ్‌లో చాలా తక్కువ మంది హీరోయిన్స్‌కి మాత్రమే సాధ్యం అయిన ఈ ఖరీదైన ఏరియాలో ఫ్లాట్ కొనుగోలు చేయడం ద్వారా కృతి సనన్ రికార్డ్ సృష్టించిందని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.