అల్లు అర్జున్ ప్లీజ్ ఆమెకు దూరంగా ఉండు.. నెట్టింట ట్రోల్స్ వైరల్!

ఎన్టీఆర్ అయిపోయాడు.. చ‌ర‌ణ్ పని అయిపోయింది.. ఇక అల్లు అర్జున్ ఉన్నాడు. అల్లూ ప్లీజ్ ఆమెకు దూరంగా ఉండు! అంటూ బ‌తిమాలుతున్నారు నెటిజ‌నులు. అస‌లింత‌కీ ఏమైంది? అంటే....

Update: 2026-06-05 10:24 GMT

ఎన్టీఆర్ అయిపోయాడు.. చ‌ర‌ణ్ పని అయిపోయింది.. ఇక అల్లు అర్జున్ ఉన్నాడు. అల్లూ ప్లీజ్ ఆమెకు దూరంగా ఉండు! అంటూ బ‌తిమాలుతున్నారు నెటిజ‌నులు. అస‌లింత‌కీ ఏమైంది? అంటే....

టాలీవుడ్‌లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్, గ్లామర్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో సరికొత్త చర్చ హీటెక్కించేస్తోంది. ఎన్టీఆర్ సరసన నటించిన తర్వాత.. రామ్ చరణ్‌తో చేసిన పెద్ది చిత్రం కూడా విడుద‌ల‌వ్వ‌డంతో నెటిజన్లు జాన్వీ తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు. ``ఎన్టీఆర్ అయిపోయాడు.. చరణ్ అయిపోయాడు.. ఇక ఆమె నెక్ట్స్ టార్గెట్ అల్లు అర్జున్`` అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు కనీసం ఇకనైనా జాన్వీ కపూర్‌కు దూరంగా ఉండాలంటూ నెట్టింట విపరీతంగా ట్రోల్స్ తో విరుచుకుప‌డుతున్నాయి.

ఈ విధమైన ఆందోళనకు ట్రోల్స్‌కు ప్రధాన కారణం జాన్వీ కపూర్ మితిమీరిన ఎక్స్ పోజింగ్ అని అంటున్నారు. ద‌ర్శ‌కులు త‌న‌ పాత్రలను మ‌రీ టూమ‌చ్ గ్లామ‌ర‌స్ గా మలుస్తున్నార‌ని వ్యాఖ్యానిస్తున్నారు. చ‌ర‌ణ్‌ స్పోర్ట్స్ డ్రామా చిత్రం `పెద్ది`లో జాన్వీ కపూర్ పాత్ర తీవ్రమైన వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలో జాన్వీ పోషించిన `అచ్చియమ్మ` పాత్రను మితిమీరిన రీతిలో సె*క్స్యువలైజ్ చేశారని.. కేవలం ఒక వస్తువులా చూపించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రామ్ చరణ్ నటన, కథలోని ఎమోషన్స్ బాగున్నా..నాయిక పాత్రను కేవలం మ‌గాళ్ల‌లో హీట్ పెంచేలా త‌న‌ను తగ్గించి చూపించడంపై చాలా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యంగా ఎక్స్, రెడ్డిట్ వంటి సామాజిక మాధ్యమాలలో ఈ చిత్రం ఎడిటింగ్, సినిమాటోగ్రఫీపై వీక్షకులు మండిపడుతున్నారు. కథలో భాగంగా హీరో హీరోయిన్ ముఖాన్ని లేదా కళ్ల అందాన్ని వర్ణిస్తున్న సమయంలో కెమెరా మాత్రం దానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఒక్కసారిగా జాన్వీ నడుము, నాభి, ఎద అందాలను ఎక్స్‌ట్రీమ్ క్లోజప్స్ లో చూపించడంపై ఆడియన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ హంగుల పేరిట క్యారెక్టర్ ఎమోషన్‌ను పక్కనబెట్టి.. ఇలా కెమెరా యాంగిల్స్ తో హీరోయిన్‌ను వస్తువులా మార్చడం పెద్ద తప్పిదమని నెటిజన్లు భావిస్తున్నారు.

ఒక ప్రతిష్టాత్మకమైన స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో మహిళా పాత్రల ప్రాధాన్యతను తగ్గించి.. కేవలం ఓవర్ ఎక్స్‌పోజింగ్, గ్లామర్ ప్రదర్శనకే పరిమితం చేసే ఇలాంటి ధోరణులు, టాలీవుడ్ మేకింగ్ పై చర్చకు దారితీస్తున్నాయి. రామ్ చరణ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవాల్సిన ప్రాజెక్ట్.. నాయిక పాత్ర చిత్రణలోని ఈ లోపాల కారణంగా నెగెటివ్ పబ్లిసిటీని ఎదుర్కొంటోంది. అందుకే భవిష్యత్తులో అల్లు అర్జున్ వంటి టాప్ స్టార్లు జాన్వీతో సినిమాలు చేసేటప్పుడు కేవలం గ్లామర్ వస్తువుగా కాకుండా బలమైన పాత్రలు ఉండేలా చూసుకోవాలని.. లేదా ఆమెకు దూరంగా ఉండటమే మంచిదని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News