ప్రభాస్ తో చేసినా లక్ కలిసి రాలేదు..!
ఐతే లాస్ట్ ఇయర్ వచ్చిన క్రూ సినిమాతో కాస్త బెటర్ అనిపించుకుంది కృతి సనన్. ప్రస్తుతం అమ్మడు తెరె ఇష్క్ మైన్ సినిమాలో నటిస్తుంది.;
మోడల్ గా రాణించి ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కెరీర్ మొదట్లో అవమానాలు ఎదుర్కొని ఆ తర్వాత వరుస విజయాలతో అదరగొట్టింది అందాల భామ కృతి సనన్. మోడలింగ్ లో ఆమె రేంజ్ వేరు అనిపించుకున్న తర్వాత తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తో 1 నేనొక్కడినే సినిమాతో ఆమె సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఐతే ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు ఆ తర్వాత తెలుగులోనే నాగ చైతన్యతో దోచెయ్ సినిమా చేసింది కృతి సనన్. ఐతే అలా చిన్నగా బాలీవుడ్ షిఫ్ట్ అయ్యి అక్కడ వరుస ఛాన్స్ లు అందుకుంది.
సినిమాలు వెబ్ సీరీస్ లు ఇలా హిందీ ఆడియన్స్ ని మెప్పిస్తూ వచ్చింది. ఐతే ఏమైందో ఏమో కానీ సడెన్ గా అమ్మడి కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. బాలీవుడ్ లో ఆమెకు ఉన్న క్రేజ్ ని చూసే రెబల్ స్టార్ చేసిన ఆదిపురుష్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అందులో సీత పాత్రలో కృతి సనన్ ఇంప్రెస్ చేసింది. ఐతే ఆ సినిమా కూడా డిజాస్టర్ అవ్వడం వల్ల కృతి సనన్ మరింత ఇబ్బందుల్లో పడింది. ఆదిపురుష్ తర్వాత మరో రెండు సినిమాలు చేసినా లాభం లేకుండా పోయింది
ఐతే లాస్ట్ ఇయర్ వచ్చిన క్రూ సినిమాతో కాస్త బెటర్ అనిపించుకుంది కృతి సనన్. ప్రస్తుతం అమ్మడు తెరె ఇష్క్ మైన్ సినిమాలో నటిస్తుంది. ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో మరోసారి బాలీవుడ్ లో తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది కృతి సనన్. ఈ సినిమా టీజర్ తోనే ఆడియన్స్ కి షాక్ ఇచ్చేలా చేశారు మేకర్స్. కృతి సనన్ తో పాటు ఈ సినిమా ధనుష్ కి కూడా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని అనిపిస్తుంది.
కృతి సనన్ మాత్రం ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది. తప్పకుండా అమ్మడు తన మార్క్ నటనతో ఆకట్టుకుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఐతే ప్రభాస్ కృతి సనన్ జోడీ బాగుంది వాళ్లు చేసిన ఆదిపురుష్ ని పక్కన పెట్టి మళ్లీ ప్రభాస్ తో ఒక యాక్షన్ సినిమాలో కృతి సనన్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేస్తే బాగుంటుందని ఆడియన్స్ అంటున్నారు. అలా జరిగితే మళ్లీ సౌత్ లో అదే ముఖ్యంగా తెలుగులో కృతి సనన్ కి మళ్లీ మంచి క్రేజ్ కొనసాగే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.