కృతి సనన్ ఆ పని చేయకుండా ఉండాల్సింది
ఓ ప్రముఖ వోడ్కా కంపెనీ కు కృతి సనన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి కృతి యువతను మద్యం తాగమని ఇన్‌డైరెక్ట్‌గా సలహా ఇస్తుందని ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.;
ఒకప్పుడు సినిమాల్లోని పౌరాణిక పాత్రలు చేయాలంటే నటీనటులు ఎంతో నిష్ఠగా ఉంటూ అన్ని నియమాలూ పాటించే వారు. రియల్ లైఫ్ లో కూడా వారు ఆ పాత్రల్లా ప్రవర్తిస్తుండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. ఒకప్పటిలా హీరో హీరోయిన్లు ఉండటం లేదు. ఎలాంటి పాత్ర చేసినా అది కెమెరా ముందు వరకే అన్నట్టు ప్రవర్తిస్తున్నారు.
సెలబ్రిటీలుగా ఉన్నప్పుడు కాస్త సామాజిక బాధ్యత వ్యవహరించాల్సింది పోయి వాళ్లే సమాజాన్ని చెడగొట్టే దిశగా పలు యాడ్స్, ప్రచారాలు చేస్తున్నారు. సినిమాలతోనే కాకుండా యాడ్ల ద్వారా కూడా డబ్బుని సంపాదించడమే లక్ష్యంగా నేటి తారలు ప్రవర్తిస్తున్నారు. సిగిరెట్స్ నుంచి పాన్, గుట్కా, మందు, బెట్టింగ్ యాప్స్ ఇలా అన్నింటినీ ప్రమోట్ చేస్తున్నారు.
వాళ్లు చేస్తుంది కరెక్ట్ కాదని ఎంతమంది చెప్పినా వినడం మానేసి ఇంకా జోరుగా ఆయా బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న బాలకృష్ణ ఓ మందు బ్రాండ్ ప్రచారంలో కనిపించగా, ఇప్పుడు అదే దారిలో ఆదిపురుష్ సినిమాలో సీతగా నటించిన కృతి సనన్ కూడా నడుస్తోంది. తాజాగా కృతి సనన్ ఓ మద్యం కంపెనీ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కు రెడీ అయింది.
ఓ ప్రముఖ వోడ్కా కంపెనీ కు కృతి సనన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి కృతి యువతను మద్యం తాగమని ఇన్‌డైరెక్ట్‌గా సలహా ఇస్తుందని ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. కృతిని మా టీమ్ లోకి తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆ బ్రాండ్ ప్రతినిధులు చెప్పగా, దానికి కృతి కూడా సంతోషం వ్యక్తం చేసింది. అయితే సినీ తారలు మద్యం ప్రచారంలో పాల్గొనడంపై విమర్శలు వస్తున్నా వాటిని సదరు సెలబ్రిటీలు ఏ మాత్రం పట్టించుకోకపోవడం విశేషం. మరి దీన్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఏదేమైనా కృతి ఆ యాడ్ కు ఒప్పుకోకుండా ఉండాల్సిందని అందరూ అభిప్రాయపడుతున్నారు.