ఎల్లో డ్రెస్‌లో కృతి శెట్టి.. కిర్రాక్ లుక్ వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు ‘బేబమ్మ’గా బాగా దగ్గరైన కృతి శెట్టి, తనదైన నటనతోనూ, అందంతోనూ తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకుంది.;

Update: 2026-04-08 16:53 GMT

తెలుగు సినీ ప్రేక్షకులకు ‘బేబమ్మ’గా బాగా దగ్గరైన కృతి శెట్టి, తనదైన నటనతోనూ, అందంతోనూ తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకునే కృతి, ప్రతీసారి తన డ్రెస్సింగ్ స్టైల్‌తో ఆకట్టుకుంటూనే ఉంటుంది. లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. క్లాస్ మాస్ ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకునేలా ఆమె ఈ ఫోటోషూట్‌లో మెరిసింది.




ఈ లాంగ్ పసుపు గౌన్ ఆమెకు చాలా స్టైలిష్ లుక్‌ను ఇచ్చింది. స్లీవ్‌లెస్ టాప్‌తో కూడిన ఈ డ్రెస్ డిజైన్ ఆమె గ్లామర్‌ను మరింత ఎలివేట్ చేసింది. ముఖ్యంగా డ్రెస్‌కు ఉన్న కట్ ఆమె లుక్‌కు ఒక మోడ్రన్ టచ్ ఇచ్చింది. ఎక్కడా అతిగా అనిపించకుండా, చాలా హుందాగా కనిపిస్తూనే తనలోని గ్లామర్ యాంగిల్‌ను ఈ ఫోటోల ద్వారా హైలెట్ చేసింది. తన హెయిర్ స్టైల్ మినిమమ్ మేకప్‌తో ఆమె సహజ సిద్ధమైన అందాన్ని ప్రదర్శించింది.




ఈ ఫోటోలలో కృతి ఇచ్చిన పోజులు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాయి. కిటికీ పక్కన నిలబడి ఆకాశం వైపు చూస్తున్నట్లుగా ఇచ్చిన స్టిల్స్, ఆమెలోని విభిన్నమైన ఎక్స్‌ప్రెషన్స్‌ను తెలియజేస్తున్నాయి. చెవికి పెట్టుకున్న చిన్నపాటి జుమ్కీలు తప్ప మరే ఇతర భారీ ఆభరణాలు వాడకుండా తన డ్రెస్‌నే హైలైట్ చేసింది. వైట్ కలర్ హీల్స్ ఆమె మొత్తం కాస్ట్యూమ్‌కు పర్ఫెక్ట్ కాంబినేషన్‌గా నిలిచాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఈ ఫోటోలను షేర్ చేసిన కొద్దిసేపటికే వేలల్లో లైకులు, కామెంట్లు వచ్చాయి.




ఇక ఉప్పెన సినిమాతో ఆమె అందుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తొలి చిత్రంతోనే వంద కోట్ల వసూళ్లను సాధించిన హీరోయిన్‌గా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకుంది. అయితే, గత కొంతకాలంగా ఆమెకు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాలు దక్కలేదు. అయినప్పటికీ, ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళ చిత్రాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ తన పరిధిని విస్తరించుకుంటోంది. నెక్స్ట్ తమిళంలో ఆమె నటించిన LIK సినిమా రిలీజ్ కానుంది.

ప్రస్తుతం కృతి శెట్టి తన దృష్టిని వైవిధ్యమైన పాత్రలపై పెట్టింది. గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటోంది. కన్నడలో కూడా కొన్ని క్రేజీ ప్రాజెక్టులలో ఆమె భాగమైనట్లు సమాచారం. ఒక హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్న కృతి, ఒక బలమైన సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది. సోషల్ మీడియా ద్వారా తన ఫాలోయింగ్‌ను నిలబెట్టుకుంటూనే, తనలోని సరికొత్త లుక్స్‌ను ఎప్పటికప్పుడు పరిచయం చేస్తోంది.

Tags:    

Similar News