ముగింపు వేళ బేబ‌మ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టేనా?

`క‌స్ట‌డీ`తో కృతిశెట్టి అలియాస్ బేబ‌మ్మ కోలీవుడ్ లో లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. కానీ ఈ సినిమా అమ్మ‌డికి నిరాశ‌నే మిగిల్చింది.;

Update: 2025-11-29 09:30 GMT

`క‌స్ట‌డీ`తో కృతిశెట్టి అలియాస్ బేబ‌మ్మ కోలీవుడ్ లో లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. కానీ ఈ సినిమా అమ్మ‌డికి నిరాశ‌నే మిగిల్చింది. ఆమెతో పాటు, నాగ చైత‌న్య‌కు `క‌స్ట‌డీ` క‌ల‌సి రాలేదు. తెలుగు, త‌మిళ్ లో రూపొందిన సినిమా రొటీన్ థ్రిల్ల‌ర్ చిత్రంగా బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోయింది. అప్ప‌టికే కృతిశెట్టి తెలుగు సినిమాల‌తో ప్లాప్ లు ఎదుర్కు టుంది. `క‌స్ట‌డీ`తో హిట్ అందుకుంటే? అక్క‌డైనా స్థిర‌ప‌డొచ్చు అన్న ఆలోచ‌న‌లో ఉంది. కానీ ప‌రాజ‌యం ఆలోచ‌న‌లో ప‌డేసింది. దీంతో మ‌ల‌యాళంలో ఎంట్రీ ఇచ్చింది. అక్క‌డ మాత్రం `ఏఆర్ ఎమ్` తో గ‌త ఏడాది మంచి విజ‌యాన్నే అందుకుంది.

రెండు క్రేజీ ప్రాజెక్ట్ ల‌తో:

కానీ అమ్మ‌డు ఇంకా అక్క‌డ సెకెండ్ ప్రాజెక్ట్ కి సైన్ చేయ‌లేదు. మ‌రి కొత్త ఏడాదైనా మాలీవుడ్ నుంచి గుడ్ న్యూస్ చెబుతుందేమో చూడాలి. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే అమ్మ‌డు తాజాగా రెండు త‌మిళ సినిమాలతో ప్రేక్ష‌కుల ముం దుకు రావ‌డానికి రెడీ అవుతుంది. అవి రెండు ఒకే నెల‌లో విడుద‌ల కావ‌డం విశేషం. ఇంత‌కీ ఏంటా ప్రాజెక్ట్ లు అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. కార్తీ హీరోగా న‌ల‌న్ కుమార్ స్వామి ద‌ర్శ‌క‌త్వంలో `వా వాత‌యార్` తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం తెలుగులో `అన్న‌గారు వ‌స్తున్నారు` టైటిల్ లో అనువాద‌మైంది. ఇందులో హీరోయిన్ గా కృతి శెట్టి న‌టించింది.

డిసెంబ‌ర్ లోనే రెండు రిలీజ్ లు:

ఈ చిత్రం అన్ని ప‌నులు పూర్తి చేసుకుని డిసెంబ‌ర్ 5న చిత్రం రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కార్తీ నుంచి మ‌రో ప‌క్కా ఎంట‌ర్ టైన‌ర్ ఖాయ‌మ‌నే పాజిటాక్ మొద‌లైంది. అలాగే కోలీవుడ్ యువ సంచ‌ల‌నం ప్ర‌దీప్ రంగ‌నాధ్ కి జోడీగా `ల‌వ్ ఇన్సురెన్స్ కంపెనీ`లోనూ కృతిశెట్టి నే హీరోయిన్ గా న‌టించింది. విగ్నేశ్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వహించిన సినిమా ఇప్ప‌టికే రిలీజ్ అవ్వాలి. కానీ పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నుల్లో జాప్యం కార‌ణంగా వీలు ప‌డ‌లేదు. ఎట్ట‌కేల‌కు అన్ని ప‌నులు పూర్తి చేసుకుని డిసెంబ‌ర్ 18న ఈచిత్రం రిలీజ్ అవుతుంది.

కొత్త ఏడాది ముంగిట కొట్టేనా?

తెలుగులోనూ ఈ సినిమా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంది. టాలీవుడ్ యువ‌త‌లో ప్ర‌దీప్ కి మంచి క్రేజ్ ఉంది. ఈ నేప థ్యంలో సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. సినిమాలో న‌య‌న‌తార కూడా గెస్ట్ రోల్ పోషించ‌డంతో? మ‌రింత హైప్ క్రియేట్ అవుతుంది. ఇలా రెండు త‌మిళ సినిమాల‌తో కృతి శెట్టి ఒకే నెల‌లో ప్రేక్ష‌కుల ముందు కొస్తుంది. ఇంత వ‌ర‌కూ అమ్మ‌డి కెరీర్ లో ఇలాంటి రిలీజ్ సన్నివేశం చోటు చేసుకోలేదు. దీంతో కృతి ఎంతో ఎగ్జైట్ అవుతుంది. ఈ సినిమా ఫ‌లితాలు కృతి శెట్టికి కీల‌క‌మే. ఇవి విజ‌యం సాధిస్తే త‌మిళ్ లో బిజీ అవ్వ‌డానికి అవ‌కాశం ఉంటుంది. మ‌రి కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టే ముందు అమ్మ‌డి సౌండింగ్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News