ఆ హీరో కారణంగా అవకాశాలు కోల్పోయిన నటి
స్నేహం కోసం కొందరు నిలబడతారు. తన స్నేహితుడి ఆత్మహత్య తర్వాత దాని వెనక కారణాల గురించి ఆరా తీసినా లేదా ప్రశ్నించినా అది పరిశ్రమలో కొందరికి నచ్చలేదని బహిరంగంగా వెల్లడించింది ఈ నటి.;
స్నేహం కోసం కొందరు నిలబడతారు. తన స్నేహితుడి ఆత్మహత్య తర్వాత దాని వెనక కారణాల గురించి ఆరా తీసినా లేదా ప్రశ్నించినా అది పరిశ్రమలో కొందరికి నచ్చలేదని బహిరంగంగా వెల్లడించింది ఈ నటి. అలా ప్రశ్నించిన కారణంగా నటిగా తాను చాలా అవకాశాలను కోల్పోయానని చెప్పింది. పరిశ్రమ తనను బ్లాక్ లిస్ట్ లో పెట్టిందని కూడా బహిరంగంగా వ్యాఖ్యానించింది.
అయితే అవకాశాలు కోల్పోయినంత మాత్రాన విలువలకు తిలోదకాలిచ్చి, స్నేహితుడికి జరిగిన అన్యాయంపై ప్రశ్నించకుండా ఉండలేని వ్యక్తిత్వం ఈ నటి సొంతం. అందుకే ఇండస్ట్రీలో తాను ఇప్పటివరకూ ఆర్థికంగా స్థిరపడలేకపోయానని, ఏమీ సంపాదించుకోలేకపోయానని కూడా తెలిపింది. పరిశ్రమలో స్నేహాలు క్షణభంగురం అనుకునే రోజుల్లో స్నేహితుడి కోసం తాను చాలా కోల్పోయానని తెలిపింది. ఇంతకీ ఈ నటి ఎవరు? అంటే... పేరు క్రిషన్ బారెట్టో. టీవీ నటి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలిసి పని చేసింది. ఆ ఇద్దరి మంచి స్నేహితులు కూడా.
2020 జూన్ లో సుశాంత్ సింగ్ అకస్మాత్తుగా మరణించినప్పుడు ఈ మరణంపై సందేహం వ్యక్తం చేసిన స్నేహితులలో క్రిషన్ బారెట్టో కూడా ఉన్నారు. అలా ప్రశ్నించినందుకు తనను ఇండస్ట్రీ శపించింది. అవకాశాలివ్వకుండా అడ్డుకుంది. సుశాంత్ ఆత్మహత్య తర్వాత ఘటనలు తనను చాలా తీవ్రంగా ప్రభావితం చేసాయని కూడా వెల్లడించింది. కల్మషం లేకుండా ఇక్కడ మాట్లాడితే ఎవరికైనా ఇదే గతి పడుతుంది. అయితే అవకాశాలు కోల్పోయినా కానీ తాను నిజం మాట్లాడటానికే కట్టుబడి ఉంటానని అంది. కెరీర్ ప్రారంభం టీవీ రంగంలో సుశాంత్ సింగ్- క్రిషన్ బారెట్టో కలిసి పని చేసారు. సుశాంత్ సింగ్ ఆ తర్వాత పెద్ద స్టార్ అయ్యాడు. కానీ క్రిషన్ మాత్రం ఎదుగూ బొదుగూ లేకుండా అలానే ఉన్నారు.
క్రిషన్ బారెట్టో బుల్లితెర నటి కం మోడల్. ఆమె ఎంటీవీ `కైసీ యే యారియన్` షో ద్వారా తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఆమె యే హై ఆషికి, ప్యార్ తునే క్యా కియా, కహానీ హమారీ ... దిల్ దోస్తీ దీవానేపన్ కి సహా చాలా షోలలో కూడా కనిపించింది. క్రిషన్ చివరిసారిగా స్టార్ ప్లస్‌లోని డైలీ సోప్ ఒపెరా, ఇష్క్‌బాజ్‌లో కనిపించింది. క్రిసన్ బారెట్టో `ససురాల్ సిమర్ కా` అవకాశాన్ని అందుకుంది.