ప్రకాష్ రాజ్ వర్సెస్ కోట.. ఈ వివాదం తెలుసా?
తెలుగు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు కోట శ్రీనివాసరావు. స్థానిక తకు పెద్దపీట వేయాలన్నది ఆయన ఉద్దేశం.;
తెలుగు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు కోట శ్రీనివాసరావు. స్థానిక తకు పెద్దపీట వేయాలన్నది ఆయన ఉద్దేశం. తెలుగు రంగస్థలం నుంచి వచ్చిన కళాకారుడు కావడంతో ఈ రంగ స్థల నియమాలను ఆయన పుణికి పుచ్చుకున్నారు. ఎక్కడివారు అక్కడే నటించడం.. అనేది రంగ స్థలం ప్రత్యేకత. దీనివల్ల.. ఇతర ప్రాంతాల్లోని వారి ఉపాధిని దెబ్బతీయకూడదన్నది కోట ఉద్దేశం. ఇదే.. ఆయనను దాదాపు 20 ఏళ్లపాటు.. ఇబ్బంది పడేలా చేసింది.
కన్నడ సినీ రంగానికి చెందిన ప్రకాష్ రాజ్ ఎంట్రీతో.. కోట సినీమాలకు ఇబ్బందులు వచ్చాయి. ప్రకాష్ రాజ్.. తన అవకాశాలను కొట్టుకుపోతున్నారన్నది కోట వాదన.. ఆవేదన కూడా!. దీనికి ఆయన తెలుగు నిర్మాతలు, దర్శకులను తీవ్రంగా తప్పుబట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ''ఎక్కడో పరాయివాళ్లను తెచ్చుకోవడం ఎందుకండీ.. మన దగ్గర నటులు లేరా?'' అని నిర్మొహమాటంగా వ్యాఖ్యానించేవారు. ముఖ్యంగా తన అవకాశాలు.. ప్రకాష్‌రాజ్ ఖాతాలో పడడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు.
అనేక అవకాశాలు నిజంగానే కోట నుంచి జారి పోయాయి. అయితే.. ప్రజాభిరుచికి.. పెద్దపీట వేయడంతో పాటు ఫక్తు వ్యాపారమయమైన సినీ రంగంలో ఎవరూ ఎవరినీ తప్పుబట్టాల్సిన అవసరం లేదు. పెట్టుబడి పెట్టే నిర్మాత తన వ్యాపారం సజావుగా సాగాలని.. లాభాలు గడించాలని చూస్తారు. ఈ తరహా.. ఆవేదన కోట కు దాదాపు 20 ఏళ్ల పాటు ఉండిపోయింది. కొన్నికొన్ని సందర్భాల్లో కోట నేరుగా ప్రకాష్‌రాజును విమర్శించి న పరిస్థితి కూడా ఉంది.
అయితే.. వాస్తవానికి నాజర్ వంటి వారు కూడా.. కోట అవకాశాలను తన్నుకు పోయారు. కానీ.. పెద్ద ఎఫెక్ట్ మాత్రం ప్రకాష్‌రాజ్‌తోనేనని కోట అభిప్రాయం. ఇక, తనను ఇంతగా కోట టార్గెట్ చేసినా.. ప్రకాష్‌రాజ్ ఎప్పుడూ.. కోటపై విమర్శలు చేసిన పరిస్థితి లేదు. ఆయనను ఎప్పుడూ గౌరవించారు. ''మీరు ఆ పాత్రలో ఉంటే.. ఆ సినిమాకు న్యాయం జరుగుతుందని భావిస్తే.. అది మీకే ఇస్తారు. నాకెందుకు ఇస్తారు..? నాకు ఇచ్చారంటే.. అది మిమ్మల్ని తక్కువ చేసినట్టు కాదు.'' అని ప్రకాష్ రాజ్.. కోటపై వ్యాఖ్యలు చేసేవారు.