చైతూతో కొరటాల మూవీ.. కానీ?
అయితే కొరటాల శివ, నాగ చైతన్యకు సంబంధించిన వార్త ఒకటి ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.;
తెలుగు చిత్ర పరిశ్రమలో కొరటాల శివ పేరు తెలియని వాళ్లుండరు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఆయన, ఆ తర్వాత పలువురు స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్లు ఇచ్చి తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ ఆయన నుంచి వచ్చిన ఆచార్య సినిమా కొరటాలకు చేదు గుర్తుగా మిగిలిపోయింది. ఆచార్య తర్వాత ఎన్టీఆర్ తో దేవర సినిమా చేసి మంచి హిట్ అందుకున్నారు కొరటాల.
దేవర2 క్యాన్సిల్ అయిందని ఫ్యాన్స్ కంగారు
కానీ దేవర సినిమా సక్సెస్ మొత్తం ఎన్టీఆర్ ఖాతాలోకే వెళ్లడంతో దేవర2తో తన సత్తా చాటుతాడని అందరూ భావించారు. అందులో భాగంగానే కొరటాల దేవర2 స్క్రిప్ట్ వర్క్స్ లో బిజీగా ఉన్నారని అందరూ అనుకుంటున్న టైమ్ లో సడెన్ గా నాగ చైతన్య పేరు వార్తల్లోకి వచ్చింది. కొరటాల నెక్ట్స్ మూవీని నాగ చైతన్యతో చేయనున్నారని వార్తలు రావడంతో దేవర2 క్యాన్సిల్ అయిందేమో అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కంగారు మొదలైంది.
అయితే కొరటాల శివ, నాగ చైతన్యకు సంబంధించిన వార్త ఒకటి ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కొరటాల, చైతూతో సినిమా చేయాలుకున్న మాట నిజమేనని, కానీ అది డైరెక్టర్ గా కాదని తెలుస్తోంది. చైతన్యతో కొరటాల సినిమా చేయాలనుకుంటున్నది నిర్మాతగా అని, డైరెక్టర్ గా కాదని సమాచారం. కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ తో కలిసి చైతన్యతో సినిమాను నిర్మించాలని చూస్తున్నారని తెలుస్తోంది.
కొరటాల- నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చే సినిమాకు దర్శకత్వ బాధ్యతలు మరొకరు చూసుకుంటారని సమాచారం. మరి ఈ సినిమాకు కొరటాల శివ కథ అందిస్తారో లేక కేవలం నిర్మాణంతోనే సరిపెట్టుకుంటారో చూడాలి. అంటే చైతూతో ముందు నుంచి కొరటాల సినిమా అనుకుంటుంది నిర్మాతగానే కానీ ఆ విషయం బయటకు వేరేలా ప్రచారమైందన్నమాట.