యంగ్ హీరో ఆలోచ‌న‌ల్ని మార్చేసిన కొర‌టాల ఫిలాస‌ఫీ

వినే టైమ్, చెప్పే మ‌నిషి వ‌ల్ల విష‌యం విలువే మారిపోతుంది అని ఓ సినిమాలో హీరో చెప్పింది అక్ష‌రాలా నిజ‌మ‌ని చెప్తున్నారు టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్న‌ల‌గడ్డ‌.;

Update: 2025-10-15 09:16 GMT

వినే టైమ్, చెప్పే మ‌నిషి వ‌ల్ల విష‌యం విలువే మారిపోతుంది అని ఓ సినిమాలో హీరో చెప్పింది అక్ష‌రాలా నిజ‌మ‌ని చెప్తున్నారు టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్న‌ల‌గడ్డ‌. తాను హీరోగా న‌టించిన తెలుసు క‌దా సినిమా అక్టోబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, చిత్ర ప్ర‌మోష‌న్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు సిద్ధు. అందులో భాగంగానే తన‌కు ఓ వ్య‌క్తి చెప్పిన మాట‌లు త‌నలో కొత్త ఆలోచ‌న‌ల్ని రేకెత్తించాయని చెప్తున్నారు.

టిల్లు తో సూప‌ర్ హిట్

అయితే సిద్ధులో అలా కొత్త ఆలోచ‌న‌ల్ని రేకెత్తించింది మ‌రెవ‌రో కాదు. మిర్చి, శ్రీమంతుడు, భ‌ర‌త్ అనే నేను లాంటి సూప‌ర్ హిట్ సినిమాలు తీసిన డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. ఆయ‌న వ‌ల్లే తాను జాక్ సినిమా త‌ర్వాత మ‌రింత స్ట్రాంగ్ గా మారానని చెప్తున్నారు. సిద్ధు కెరీర్లో టిల్లు సినిమాలు సూప‌ర్‌హిట్లుగా నిలిస్తే, జాక్ సినిమా మాత్రం డిజాస్ట‌ర్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

ఇక‌పై ఏం జ‌రిగినా ఆ రెండింటి మ‌ధ్యే!

జాక్ మూవీ రిలీజ‌య్యాక కొరటాల, సిద్ధుకి ఫోన్ చేసి టిల్లుతో ఆల్ టైమ్ హై చూశావు, జాక్ మూవీతో ఆల్ టైమ్ లో చూశావు, ఇవ‌పై నువ్వేం చేసినా ఆ రెండింటి మ‌ధ్యే చూస్తావ‌ని, కాబ‌ట్టి ఏం జ‌రిగినా ఇక ఫీల‌య్యే ప‌న్లేద‌ని చెప్పార‌ని, దాని వ‌ల్ల తాను ఇక‌పై ఎలాంటి సిట్యుయేష‌న్స్ వ‌చ్చిన ఇలానే ఆలోచించాల‌ని డిసైడ్ అయిన‌ట్టు సిద్ధు చెప్పుకొచ్చారు.

అయితే ఫ్లాపుల్లో ఉన్న యంగ్ హీరోను మోటివేట్ చేయ‌డానికి కొర‌టాల చెప్పిన ఆ ఫిలాస‌ఫీ బాగానే ఉంది కానీ ఈ ఫిలాస‌ఫీ ఆయ‌న‌కు ఎవ‌రైనా చెప్పారా లేదా త‌న స్వీయ అనుభ‌వంతో చెప్పి ఉంటారా అని అంద‌రూ అనుకుంటున్నారు. ఎందుకంటే సిద్ధు లాగానే కొరటాల కూడా ఆ రెండు సిట్యుయేష‌న్స్ ను ఎక్స్‌పీరియెన్స్ చేశారు. ప‌లు సినిమాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను అందుకున్న కొర‌టాల, మెగాస్టార్ చిరంజీవితో చేసిన ఆచార్య మూవీతో మాత్రం త‌న కెరీర్ ఆల్ టైమ్ డిజాస్ట‌ర్ ను అందుకున్నారు. ఆచార్య త‌ర్వాత కొర‌టాలను అంద‌రూ ఎంత‌గానో విమ‌ర్శించారు కూడా. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న మాత్రం వాటిని ప‌ట్టించుకోకుండా ఎన్టీఆర్ తో దేవ‌ర సినిమా చేసి ఆ సినిమాతో హిట్ అందుకున్నారు. కాబ‌ట్టి కొర‌టాల, సిద్ధుకి చెప్పిన విష‌యం త‌న ఓన్ ఎక్స్‌పీరియెన్స్ తోనే అయుండొచ్చు.

Tags:    

Similar News