KJQ టీజర్ టాక్: సిటీ, గన్ రెండూ ఒకటే..
కె. కె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు. 1990ల నాటి కథాంశంతో కే జే క్యూ తెరకెక్కినట్టు తెలుస్తోంది.;
దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా కే జే క్యూ. అదే కింగ్ జాకీ క్వీన్. కె. కె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు. 1990ల నాటి కథాంశంతో కే జే క్యూ తెరకెక్కినట్టు తెలుస్తోంది. పీరియాడిక్ క్రైమ్ డ్రామగా తెరకెక్కిన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.
దసరా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దీక్షిత్ శెట్టి ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా నటిస్తున్నట్టు టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఈ సిటీ, గన్.. రెండూ ఒకటే. ఎవరి చేతిలో ఉంటుందో వాడి మాటే వింటుంది అనే డైలాగ్ తో మొదలైన కే జే క్యూ టీజర్, లాస్ట్ షాట్ వరకు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటూ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది.
మగాడు గెలుచుకుంటాడు, కానోడు లాక్కుంటాడు.. నువ్వేంటో నీకే తెలియాలంటూ హీరోయిన్ తో చెప్పించిన డైలాగ్ బావుంది. ఇక టీజర్ లాస్ట్ లో రావణాసురుడు నా లెక్క ఆలోచంచకపోతే రామాయణం ఉండేది కాదంటూ టీజర్ ను ముగించిన విధానం సినిమాపై ఇంట్రెస్ట్ ను పెంచడంతో పాటూ ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అనే క్యూరియాసిటీని పెంచింది. దసరాతో పాటూ పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ లో నిర్మించగా, కే జే క్యూ కి పూర్ణచంద్ర తేజస్వి సంగీతాన్ని అందించాడు.