దీపావళి సినిమాలకు కిష్కింధపురి ఎఫెక్ట్?
థియేటర్లలో ఆడియన్స్ ను అలరించిన కిష్కింధపురి ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది.;
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా కిష్కింధపురి, హార్రర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ తో హిట్ టాక్ ను తెచ్చుకుంది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో ఆడియన్స్ కు మంచి ఎక్స్‌పీరియెన్స్ ను అందించింది.
ఓటీటీలోకి వచ్చేసిన కిష్కింధపురి
థియేటర్లలో ఆడియన్స్ ను అలరించిన కిష్కింధపురి ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. కిష్కింధపురి డిజిటల్ రైట్స్ ను జీ5 సొంతం చేసుకోవడంతో అందులోనే కిష్కింధపురి అందుబాటులోకి వచ్చింది. కిష్కింధపురి రేడియో స్టేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో చూసేయొచ్చు.
దీపావళి రిలీజైన పలు సినిమాలు
అయితే ఈ దీపావళికి థియేటర్లలో పలు సినిమాలు రిలీజైన సంగతి తెలిసిందే. మిత్ర మండలి, డ్యూడ్, తెలుసు కదా, కె ర్యాంప్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా, వాటిలో యునానిమస్ పాజిటివ్ టాక్ ఏ సినిమాకీ రాలేదు. ఆల్రెడీ గత నెలలో వరుస హిట్ సినిమాలను థియేటర్లలో చూసిన ఆడియన్స్, ఇప్పుడు పాజిటివ్ టాక్ రాని సినిమాలను టికెట్ కొని థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలనుకోరు.
ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం
అలాంటి వారందరికీ ఈ వారం కొత్తగా ఓటీటీలోకి వచ్చిన కిష్కింధపురి బెస్ట్ ఆప్షన్ గా నిలవడం ఖాయం. సరదాగా దీపావళిని సెలబ్రేట్ చేసుకుని తర్వాత ఇంట్లోనే ఉండి అందరూ కలిసి కిష్కింధపురినే చూస్తారు తప్పించి థియేటర్లకు వెళ్లి పెద్దగా ఆడని సినిమాలను చూడాలనుకోరు. ఈ యాంగిల్ లో చూసుకుంటే దీపావళి సినిమాలకు ఈ ఓటీటీ సినిమా నుంచి కొంచెం రిస్క్ ఎదురయ్యే ఛాన్స్ లేకపోలేదు. ఈ విధంగా చూసుకుంటే కిష్కింధపురికి ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కే అవకాశముంది.