• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కొత్త జంట వెడ్డింగ్...

కొత్త జంట వెడ్డింగ్ మెమోరీస్.. అదిరిపోయేలా!

| కొన్ని నెలల క్రితం నిశ్చితార్థం చేసుకున్నాక.. తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా రివీల్ చేశారు.

By - Tupaki Desk
Update: 2024-08-28 14:32 GMT

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్ గా తన బ్యాచిలర్ లైఫ్ ‏కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తన డెబ్యూ మూవీ హీరోయిన్, ప్రియురాలు రహస్య గోరఖ్ తో కొన్ని రోజుల క్రితం ఏడడుగులు నడిచారు. రాజావారు రాణిగారు సినిమాతో హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన వారిద్దరూ.. ఆ సమయంలో ప్రేమలో పడ్డారు. అప్పటి నుండి ప్రేమలో మునిగి తేలుతున్నా బయటకు రివీల్ చేయలేదు. ఐదేళ్ల పాటు తమ లవ్ మ్యాటర్ గా సీక్రెట్ గా ఉంచారు.


కొన్ని నెలల క్రితం నిశ్చితార్థం చేసుకున్నాక.. తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా రివీల్ చేశారు. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లికి సిద్ధమయ్యారు. ఆగస్టు 22వ తేదీన కర్ణాటకలోని కూర్గ్ లో కిరణ్, రహస్య ఒక్కటయ్యారు. ఓ రిసార్ట్ లో జరిగిన రాజా వారు రాణి గారి పెళ్లికి కొద్ది మంది సినిమా సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. కేవలం ఇరు వైపుల నుంచి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య కిరణ్, రహస్య వివాహం అంగరంగ వైభవంగా జరిగిందన్న విషయం తెలిసిందే.


వివాహం అయిన తర్వాత కిరణ్, రహస్య ఒక్కటైనట్టు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. పెళ్లి ఫోటోలు కూడా షేర్ చేశారు. అయితే ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన పిక్స్ మాత్రం బయటకు రాలేదు. ఎవరూ షేర్ కూడా చేయలేదు. ఇక రీసెంట్ గా రహస్య గోరఖ్.. ప్రీవెడ్డింగ్‌ వేడుకలకు సంబంధించిన పిక్స్ తోపాటు హల్దీ, మెహందీ, సంగీత్ చిత్రాలను షేర్ చేసింది. తన జీవితంలో బెస్ట్‌ మూమెంట్‌ ఇదేనని రహస్య పేర్కొంది. తమకు విషెస్ చెప్పిన వారికి స్పెషల్ థాంక్స్ చెప్పింది.


"ప్రతి ఒక్కరి నుంచి మాకు విషెస్ వస్తున్నాయి. మా వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగమైన అందరికీ ధన్యవాదాలు. మీ లవ్, మీ విషెస్ మా స్పెషల్‌ డేను మరింత స్పెషల్ గా చేశాయి. మీ ఆప్యాయతలకు మేము ఎప్పటికీ కృతజ్ఞులముగా ఉంటాం" అంటూ రాసుకొచ్చింది రహస్య. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. మరోసారి అభిమానులు, నెటిజన్లు.. కొత్త జంటకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


అయితే హల్దీ ఫంక్షన్ లో కిరణ్, రహస్య చాలా అందంగా కనిపిస్తున్నారు. సంగీత్ లో ధూమ్ ధామ్ డ్యాన్సులతో ఇద్దరూ అదరగొట్టినట్లు తెలుస్తోంది. హల్దీలో వేరే లెవల్ లో సందడి చేసినట్లు అర్థమవుతోంది. పెళ్లి బట్టల్లో మరింతగా ట్రెడిషనల్ గా, బ్యూటిఫుల్ గా అట్రాక్ట్ చేస్తున్నారు. ఇక సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ ‏గా పనిచేసిన రహస్య, కిరణ్.. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో సినిమాల్లోకి వచ్చారు. ప్రేమలో పడ్డారు. ఇప్పుడు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఎనీ వే హ్యాపీ మ్యారీడ్ లైఫ్!

Tags:    
  • KiranAbbavaram 
  • RahasyaGorak 
  • Wedding 
  • Actress 
  • Trendingclicks 

Similar News

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS