వెబ్ సిరీస్ రూట్ లోకి టాలీవుడ్ హీరో.. అక్కడ సక్సెస్ అవుతాడా?

హీరో, హీరోయిన్లు సినిమాలతోపాటు వెబ్ సిరీస్ లు చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీలో కామన్ గా మారింది. ఓటీటీల వాడకం పెరిగాక, వెబ్ సిరీస్ ల ప్రభావం కూడా మూవీ లవర్స్ పై పడింది.;

Update: 2025-10-09 11:11 GMT

హీరో, హీరోయిన్లు సినిమాలతోపాటు వెబ్ సిరీస్ లు చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీలో కామన్ గా మారింది. ఓటీటీల వాడకం పెరిగాక, వెబ్ సిరీస్ ల ప్రభావం కూడా మూవీ లవర్స్ పై పడింది. అందుకే సినిమాలే కాదు ఎపిసోడ్ ల వారిగా ఉండే వెబ్ సిరీస్ లనూ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కొవిడ్ తర్వాత ఈ సిరీస్ ల ట్రెండ్ తెలుగులో మరింత పెరిగింది. అందుకే ప్రేక్షకుల రుచికి తగ్గట్లే మేకర్స్ కూడా సిరీస్ లు నిర్మిస్తున్నారు.

కంటెంట్ బాగుంటే సిరీస్ లకు మంచి స్పందన లభిస్తుంది. కొందరు మేకర్స్ కొత్త వాళ్లతో చేస్తే, మరి కొందరు స్టార్ హీరో హీరోయిన్లతోనే రూపొందిస్తున్నారు. ఇంకా కొంత మందైతే వెబ్ సిరీస్ ల్లో సక్సెస్ అయ్యాకే, సినిమాల్లోకి వచ్చిన వాళ్లు ఉన్నారు. ఈ లిస్ట్ లో టాప్ హీరో నాగచైతన్య కూడా ఉన్నారు. ఆయన సినిమాల్లో రాణిస్తూనే వెబ్ సిరీస్ వైపు మళ్లారు. ఆ మధ్యలో దూత అనే వెబ్ సిరీస్ లో నటించారు. నటులు ప్రియదర్శి, అభినవ్ గొమఠం కూడా సేవ్ ది టైగర్స్ అనే సిరీస్ తో సూపర్ సక్సెస్ అయ్యారు.

ఇక వెబ్ సిరీస్ ల్లో నటించిన హీరోయిన్లు చాలానే ఉన్నారు. తమన్నా భాటియా, కియారా అద్వాణీ, ప్రియమణి, సమంత ఇలా అనేకమంది నటీమణులు వెబ్ సిరీస్ ల్లోనూ సత్తా చాటారు. ఇప్పుడు ఈ దారిలోకి తెలుగు నుంచి ఓ యంగ్ హీరో వెళ్లనున్నాడు. అతడు ఎవరో కాదు. కిరణ్ అబ్బవరం. గతేడాది క సినిమాతో మంచి విజయం అందుకున్న అతడు ప్రస్తుతం కే ర్యాంప్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఇదిలా ఉండగా, కిరణ్ ఓ సిరీస్ కు రీసెంట్ గా సైన్ చేశాడు. ఈ సిరీస్ ఫైనలైజ్ కూడా అయ్యిందట. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తోంది. దీని షూటింగ్ 2027 ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ను కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నారు. భరత్ కమ్మ షో రన్నర్ గా వ్యవహరిస్తారు. సినిమాల్లో సక్సెస్ అయిన కిరణ్.. సిరీస్ ల్లో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి మరి.

ఇక సిరీస్ ల విషయానికొస్తే.. సినిమాల కంటే వీటిని తక్కువ బడ్జెట్ తో నిర్మించవచ్చు. మార్కెటింగ్, ప్రమోషన్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. థియేటర్ అడ్జస్ట్ మెంట్ గోల ఉండదు. కాంపిటీషన్ మాట అసలే లేదు. పైగా స్టార్లతోనే కాకుండా కొత్త వాళ్లను కూడా ఎంకరేజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. తక్కువ టైమ్ లోనే చిత్రీకరణ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావొచ్చు. మరి ఆ రూట్లో కిరణ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News