టీజర్: లిప్ లాక్స్ తో కిరణ్ అబ్బవరం ఘాటైన బిల్డప్
టాలెంటెడ్ నటుడు కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రానున్నారు.;
టాలెంటెడ్ నటుడు కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రానున్నారు. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది.
ఇందులో కిరణ్ కుమార్ పాత్రలో పక్కింటి కుర్రాడిలా, కాలేజీ స్టూడెంట్ గా కనిపిస్తున్నారు. ఆకతాయి విషయాల్లో తండ్రికి తగ్గ కొడుకుగా కనిపించనున్నారు. ఆయన తమ ఫ్రెండ్స్ తో చేసే అల్లరి పనులు ఆకట్టుకుంటున్నాయి. హీరోకు తగ్గట్లే హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ హీరో హీరోయిన్ల తండ్రుల మధ్య సంభాషణ ఆ విషయాన్ని తెలియజేస్తుంది.
టీజర్ మొత్తం కిరణ్ ఫుల్ ఎనర్జిటిగ్ గా కనిపించారు. వెన్నెల కిషోర్, బలగం ఫేమ్ నటుడు మురళీధర్ డైలాగ్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇక హెవీ ఎంటర్టైన్మెంట్ లోడింగు అంటూ టీజర్ ఆఖర్లో ఓ డైలాగ్ సినిమా మీద అంచనాలు పెంచుతుంది. 1.43 నిమిషాల టీజర్ చూశాక నిజంగానే ఎంటర్టైన్మెంట్ పక్కా అన్న నమ్మకం కలుగుతుంది. ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకునేలా ఉంది ఈ సినిమా స్టోరీ. సినిమాలో హెవీ ఎంటర్టైన్మెంట్ ఉండనందని టీజర్ తో హింట్ ఇచ్చారు.
ఇందులో కిరణ్ తండ్రిగా సీనియర్ నటుడు సాయికుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా.. హీరోయిన్ ఫాదర్ గా మురళీధర్ కనిపించారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ పాత్రల చుట్టే కథ తిరుగుతుందని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. కిరణ్ కు గతంలో అన్నీ లవ్ స్టోరీలే చేశారు. గతేడాది క సినిమాతో కొత్త ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. కానీ, ఈ సినిమా అవన్నింటి కంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుంది.
ఎంటర్టైన్మెంట్ మెయిన్ జానర్ గా ఈసినిమా రావడం, కిరణ్ తొలిసారి ఇలా ఫన్ మోడ్ లో కనిపించనుండడం కూడా ఆసక్తి కలిగిస్తుంది. ఓవరాల్ గా టీజర్ మాత్రం ఆకట్టుకునేలా కట్ చేశారు. దీంతో సినిమా చూసేందుకు ఆడియెన్స్ ను థియేటర్లకు రప్పించే ప్రయత్నంలో ఇది ఒకటిగా చూడవచ్చు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. సినిమా విడుదలకు ఇంకో నెల రోజులే ఉండడంతో త్వరలోనే ట్రైలర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహించగా, హాస్య మూవీస్, సెల్యులాయిడ్ బ్యానర్లపై రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.