'క' స్టార్‌ చెన్నై లవ్‌ స్టోరీ సీక్రెట్‌...!

గత ఏడాది 'క' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని సొంతం చేసుకున్న కిరణ్‌ అబ్బవరం ఈ ఏడాది దిల్‌ రుబా సినిమాతో వచ్చాడు.;

Update: 2025-04-27 00:30 GMT

గత ఏడాది 'క' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని సొంతం చేసుకున్న కిరణ్‌ అబ్బవరం ఈ ఏడాది దిల్‌ రుబా సినిమాతో వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. దిల్‌రుబా సినిమా ఫలితం నుంచి వెంటనే బయటకు వచ్చిన కిరణ్ అబ్బవరం తదుపరి సినిమా పనిలో పడినట్లు సమాచారం అందుతోంది. గతంలో మాదిరిగా కాకుండా సినిమాల ఎంపిక విషయంలో కిరణ్ అబ్బవరం జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దర్శక నిర్మాతల విషయంలో కిరణ్ అబ్బవరం ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తున్నాడని, అందుకే ఆయన వద్దకు వచ్చిన పలు సినిమా ఆఫర్లను వెనక్కి పంపిస్తున్నాడని తెలుస్తోంది.

ఇటీవల కిరణ్ అబ్బవరం తదుపరి సినిమాకు ఓకే చెప్పాడు. రవి నంబూరి దర్శకత్వంలో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌లో కొత్త సినిమా రూపొందబోతుంది. ఆ సినిమాకు చెన్నై లవ్‌ స్టోరీస్‌ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. కిరణ్ అబ్బవరంను కొత్తగా చూపించడంతో పాటు, యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా, ఈతరం ప్రేమ ఎలా ఉంటుంది, ప్రస్తుత కాలంలో ప్రేమ కథలు ఎలా ఉన్నాయి అనే విషయాలను గురించి చూపించే విధంగా ఈ సినిమాను రవి నంబూరి రూపొందిస్తున్నాడని సమాచారం అందుతోంది. అతి త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేసేందుకు గాను నిర్మాణ సంస్థ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

బేబీ సినిమాను నిర్మించిన మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. సినిమా కథ పై చాలా నమ్మకంగా మేకర్స్ ఉన్నారని, కిరణ్ అబ్బవరం కూడా కథపై చాలా నమ్మకంగా ఉన్నాడని తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కిరణ్ అబ్బవరంపై సినిమా ప్రకటనకు సంబంధించిన వీడియోను షూట్‌ చేశారట. విశాఖపట్నంలోని బీచ్‌లో సినిమా అనౌన్స్మెంట్‌ వీడియోను షూట్‌ చేశారని, దాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు గాను వర్క్ జరుగుతుందని, ఆ వీడియోకు మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ను ఇస్తున్నట్లు కిరణ్ అబ్బవరం సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది. అధికారిక ప్రకటన కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

'క' సినిమాతో నటుడిగా కిరణ్ అబ్బవరం ఆకట్టుకున్నాడు. నటుడిగా తనను తాను నిరూపించుకున్న కిరణ్ అబ్బవరం దిల్‌రుబా సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. కానీ సినిమాకు ప్రేక్షకుల నుంచి స్పందన దక్కలేదు. లవ్‌ స్టోరీస్ ను ప్రేక్షకులు కిరణ్ అబ్బవరం నుంచి ఆశిస్తున్నారని, అందుకే ఈ సినిమాను ఆయన చేసేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. రవి నంబూరి పలు సినిమాలకు వర్క్ చేశారు. గుడ్ సినిమా గ్రూప్‌తో పాటు, మాస్ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లతో దర్శకుడికి మంచి సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం బాడీలాంగ్వేజ్‌కి తగ్గట్లుగా మంచి కథతో ఈ సినిమాను రూపొందించబోతున్నారు. త్వరలోనే సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాదిలో సినిమా విడుదల ఉండే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News