K-ర్యాంప్ ట్రైలర్.. ప్రేయసి టార్చర్ లో అబ్బవరం మాస్ కామెడీ

చిన్న సినిమాలతో తనకంటూ ఒక యూత్‌ఫుల్ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం మెల్లగా తన స్థాయిని పెంచుకుంటూ ఉన్నాడు.;

Update: 2025-10-11 13:29 GMT

చిన్న సినిమాలతో తనకంటూ ఒక యూత్‌ఫుల్ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం మెల్లగా తన స్థాయిని పెంచుకుంటూ ఉన్నాడు. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత ‘క’ సినిమాతో కమ్‌బ్యాక్ ఇచ్చినా, ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను దీపావళి రేస్‌లో దింపుతున్నాడు. ఆ సినిమానే 'K-ర్యాంప్'. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్.. ఈ సినిమా కథా నేపథ్యం, ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ ఎలా ఉండబోతున్నాయో స్పష్టంగా చూపించింది.

​జైన్స్ నాని దర్శకత్వం వహించిన 'K-ర్యాంప్' ట్రైలర్ పూర్తిస్థాయి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఉంది. ఈ ట్రైలర్ చూస్తుంటే, హీరో కుమార్ (కిరణ్) తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్న రిలేషన్‌షిప్‌లో పడే ప్రస్ట్రేషన్, భయాన్ని ఫస్ట్ సీన్ లొనే చూపించారు. ఆ మాస్ కామెడీ నేపథ్యంలోనే కథ నడుస్తున్నట్లు తెలుస్తోంది. 'నా పేరు అబ్బవరం... ఇస్తా వరం' లాంటి డైలాగ్స్.. సోషల్ మీడియా మీమ్స్‌ను ఎక్కువగా వాడుకుని, రీసెంట్ ట్రెండ్‌కు కనెక్ట్ అయ్యేలా ఈ ట్రైలర్‌ను కట్ చేశారు.

కాలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్కువ శాతం కేరళలో షూటింగ్ జరపడం అనేది విజువల్‌గా కొత్త అనుభూతిని ఇస్తుంది. ​ట్రైలర్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, కొన్ని కమర్షియల్ యాక్షన్ ఎలిమెంట్స్ కూడా బాగానే డిజైన్ చేశారు. హీరోయిన్‌తో కిరణ్ కెమిస్ట్రీ బాగుంది. ముఖ్యంగా సీనియర్ నరేష్ క్యారెక్టర్, వెన్నెల కిషోర్, సాయికుమార్ వంటి నటుల పాత్రలు ఈ సినిమాలో మంచి ఫన్ క్రియేట్ చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాలో ఉంటుందని ట్రైలర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.

​ప్రస్తుత రోజుల్లో ఇలాంటి కామెడీ కథలు క్లిక్కయితే బాగానే ఉంటుంది. కానీ ఏమాత్రం తేడా కొట్టినా ఆడియెన్స్ లైట్ తీసుకుంటారు. రొటీన్ గా అనిపిస్తే మొదటి షోకే ఎఫెక్ట్ కావచ్చు. ఇక 'K-ర్యాంప్' ఎంటర్‌టైన్‌మెంట్‌ను నమ్ముకుంది. ఈ దీపావళి సీజన్‌లో వినోదానికి అలవాటుపడిన ప్రేక్షకులు ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ, ఈ దీపావళి రేసులో చివరగా వస్తున్న సినిమా ఇదే.

మరోవైపు ​'తెలుసు కదా', 'డూడ్' వంటి చిత్రాల నుంచి వస్తున్న గట్టి పోటీని తట్టుకొని కిరణ్ అబ్బవరం సినిమా నిలబడాలంటే, ట్రైలర్ చూపించిన కామెడీ డోస్ కంటే, ఎంటర్టైన్మెంట్ ఇంకా గట్టిగా ఉండాలి. సాధారణ యూత్‌ఫుల్ కంటెంట్ మాత్రమే ఉంటే, లేట్ ఎంట్రీ కారణంగా ఓపెనింగ్స్ విషయంలో 'K ర్యాంప్' ఇబ్బంది పడక తప్పదు. మరి కిరణ్, జైన్స్ నాని కాంబో ఈ దీపావళికి ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News