అర్జున్ రెడ్డి ముద్దు రికార్డ్‌ని కిరణ్ బ్రేక్ చేస్తాడా ఏంటి?
అర్జున్ రెడ్డి సినిమాలో ఉన్న ముద్దు సీన్స్ కారణంగా అప్పట్లో వివాదం నడిచింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.;
తెలుగు సినిమాలు వసూళ్ల విషయంలో, సాంకేతిక పరిజ్ఞానం, వీఎఫ్‌ఎక్స్ విషయంలో బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతున్న ఈ సమయంలో ముద్దు సీన్స్ విషయంలో మాత్రం ఎందుకు వెనుక ఉండాలి అనుకున్నారో ఏమో కానీ వరుసగా రొమాంటిక్ మూవీస్, లిప్‌లాక్ సీన్స్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. అర్జున్ రెడ్డితో ఇది మొదలైంది. విజయ్ దేవరకొండ సినిమాలో చేసిన లిప్ లాక్ సీన్స్ అప్పట్లో సంచలనంగా మారింది. ఆ తర్వాత ఆ స్థాయిలో కాకున్నా ముద్దు సీన్స్ కామన్ అయ్యాయి. తెలుగు సినిమాల్లో ముద్దు సీన్స్ కామన్ అయ్యాయి కానీ రాబోయే కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ సినిమా మరోసారి ముద్దు సీన్స్ గురించి చర్చ జరిగేలా చేసే అవకాశాలు ఉన్నాయట. ఎందుకంటే కె ర్యాంప్ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోయిన్‌తో ఏకంగా 16 సార్లు లిప్ లాక్ చేశాడని అంటున్నారు. కథ బలంగా డిమాండ్ చేయడంతో తప్పలేదని అంటున్నారు.
కె ర్యాంప్ మూవీతో కిరణ్ అబ్బవరం
కిరణ్ అబ్బవరం సినిమా అనగానే ఒక సింపుల్, మిడిల్ క్లాస్ కుర్రాడి సినిమా గుర్తుకు వస్తుంది. ఆయన ఎక్కువ శాతం అలాంటి పాత్రలే చేశాడు. అయితే ఈసారి అందుకు భిన్నంగా ఆయన సినిమా, ఆయన పాత్ర ఉండే అవకాశం ఉందని కె ర్యాంప్ సినిమా యొక్క ప్రమోషనల్ స్టఫ్ ను చూస్తే అనిపిస్తోంది. దానికి తోడు ఈ సినిమాలో ఆయన 16 లిప్ లాక్ ముద్దులు పెట్టాడు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి సినిమాపై ఉంది. కె సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు కె ర్యాంప్ అనే టైటిల్ తో సినిమాను తీసుకు వస్తున్నాడు. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి సినిమా హిట్ అవుతుందేమో అనే నమ్మకంతో కిరణ్ అబ్బవరం ఉన్నాడు. అంతే కాకుండా సినిమాలో తన పాత్రను గతంలో ఎప్పుడూ చూడని విధంగా ప్లాన్ చేసుకున్నాడని, ఇలాంటి ఒక కథను సెలక్ట్ చేసుకునేందుకు కిరణ్ ఖచ్చితంగా ప్రశంసలు దక్కించుకుంటాడని చిత్ర యూనిట్ సభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ముద్దు సీన్స్‌తో హద్దులు దాటి..
అర్జున్ రెడ్డి సినిమాలో ఉన్న ముద్దు సీన్స్ కారణంగా అప్పట్లో వివాదం నడిచింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఖచ్చితంగా కె ర్యాంప్ సినిమాలోని ముద్దు సీన్స్‌కి సెన్సార్ బోర్డ్ నుంచి కత్తెరింపు ఉండవచ్చు. ఎ సర్టిఫికెట్ ఇచ్చి కూడా ఒకటి రెండు తగ్గించడం లేదా కుదించడం వంటివి చేస్తారు అని యూనిట్ సభ్యులు అనుకుంటున్నారు. అయితే యూనిట్ సభ్యులు మాత్రం సాధ్యం అయినన్ని ఎక్కువ ముద్దు సీన్స్ ను సినిమాలో ఉంచాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఫ్యామిలీస్ రారు, పిల్లలు చూడరు అనే భయం లేదని, ఖచ్చితంగా ఈ సినిమాను అందరూ చూస్తారని యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతానికి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఈ విషయాన్ని గురించి పెద్దగా ప్రస్తావించడం లేదు. సినిమా విడుదల సమయంకు ఎన్ని ముద్దు సీన్స్ ఉంటాయో అనేది చూడాలి.
యుక్తి తరేజా హీరోయిన్‌గా
అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై కిరణ్ అబ్బవరం చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు. ఆయన ప్రమోషన్ సమయంలో చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడటం చూస్తూ ఉంటే సినిమా పట్ల ఆయన నమ్మకం కనిపిస్తుంది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంకు జోడీగా యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. సినిమాలో హీరో, హీరోయిన్ పాత్రలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఇద్దరు ఇద్దరే అన్నట్లుగా బోల్డ్‌గా ఉంటారట. అందుకే సినిమాలో అన్ని ముద్దు సీన్స్‌కు స్కోప్ ఉంటుందని, సినిమా చూస్తున్న సమయంలో ముద్దు సీన్స్ కావాలని పెట్టినట్లు అనిపించదు అని, సందర్భానుసారంగానే లిప్ లాక్ సీన్స్ ఉంటాయని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికి కిరణ్ అబ్బవరం అభిమానులతో పాటు అందరూ ఈ సినిమా కోసం ఎదురు చూసే విధంగా ప్రచారం జరుగుతోంది. మరి కిరణ్ అబ్బవరం కు ఈ సినిమా విజయాన్ని అందిస్తుందా అనేది చూడాలి.