కింగ్ డమ్ కు ప్రీమియర్స్ అందుకే లేవు: నాగవంశీ
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. ఇప్పుడు కింగ్ డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. ఇప్పుడు కింగ్ డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. స్పై జోనర్ లో జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. టాలెంటెడ్ యాక్టర్ సత్యరాజ్ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. యువ సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు కంప్లీట్ చేసుకున్న కింగ్ డమ్.. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే నేటి రాత్రి (జూలై 30) కింగ్ డమ్ పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయని రీసెంట్ గా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. నిర్మాత నాగవంశీ కూడా అందుకు హింట్ ఇచ్చారు. కానీ మేకర్స్.. ప్రీమియర్స్ వేయడం లేదు. దాని వెనుక ఇదే కారణమంటూ రకరకాల వార్తలు వినిపించాయి. ప్రీమియర్స్ వేయకపోవడమే బెస్ట్ అని అంతా అన్నారు.
ఇప్పుడు ప్రీమియర్స్ ఎందుకు వేయడం లేదో నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా.. విజయ్ ఫ్యాన్స్ ప్రీమియర్స్ ను ఎక్స్పెక్ట్ చేశారు.. మీరు కూడా హింట్ ఇచ్చారు.. కానీ ఎందుకు వేయడం లేదు అని ఓ ప్రతినిధి అడిగారు. దీంతో శనివారం ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఆదివారం టికెట్స్ రిలీజ్ చేశామని గుర్తు చేశారు.
టెంపో చాలా బాగున్నట్లు అనిపించిందని చెప్పారు. నైజాంలో మార్నింగ్ 7 గంటల నుంచే షోస్ వేస్తున్నామని తెలిపిన నాగవంశీ.. అందుకే ప్రీమియర్స్ అవసరం లేదనిపించిందని చెప్పారు. అయితే ఇండియన్ టైమింగ్ ప్రకారం.. బుధవారం రాత్రి 10.30-11.00 గంటలకు అమెరికాలో ప్రీమియర్ షోస్ పడనున్నారని నాగవంశీ తెలిపారు.
కాగా, ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్, సాంగ్స్ సహా ప్రమోషనల్ కంటెంట్ మొత్తానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంతా అంచనా వేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. మరి కింగ్ డమ్ ఎలా ఉంటుందో.. ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.