కింగ్ డమ్ 'అన్న అంటేనే' సాంగ్ వచ్చేసింది..!

విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న కింగ్ డమ్ సినిమా నుంచి అన్న అంటేనే సాంగ్ రిలీజైంది.;

Update: 2025-07-16 15:00 GMT

విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న కింగ్ డమ్ సినిమా నుంచి అన్న అంటేనే సాంగ్ రిలీజైంది. అనిరిద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని ఈ సాంగ్ బ్రదర్స్ మధ్య ఒక మంచి ఎమోషనల్ సాంగ్ గా ఉంది. అన్న అంటేనే అంటూ వచ్చిన ఈ సాంగ్ ట్యూన్, కంపోజింగ్, వోకల్ అన్నీ కూడా ఇంప్రెసివ్ గా ఉన్నాయి.

విజయ్ దేవరకొండ అన్న పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నాడు. సత్యదేవ్, విజయ్ ఇద్దరు కూడా రియల్ బ్రదర్స్ లానే ఉన్నట్టు అనిపిస్తుంది. సినిమాలో బ్రదర్ సెంటిమెంట్ సాంగ్ ఉంది అంటే బ్రదర్ రోల్ కూడా ఇంపార్టెంట్ అయ్యి ఉంటుంది. ఐతే అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేసిన అన్న అటేనే సాంగ్ ను కృష్ణ కాంత్ రచించగా అనిరుద్ స్వయంగా ఈ పాటని ఆలపించారు.

అన్న మీద ప్రేమతో తమ్ముడు పాడే పాటగా అన్న అంటేనే సినిమాలో కూడా కీలకం అయ్యేలా ఉంది. ఇక విజయ్ దేవరకొండ కింగ్ డమ్ యాక్షన్ విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బెస్ట్ యాక్షన్ సీన్స్ తో ఇది వస్తుందని తెలుస్తుంది. అంతేకాదు సినిమా చూశాక ఈ సినిమాను జెర్సీ తీసిన గౌతం తీశాడా అనే రేంజ్ లో ఉంటుందట.

విజయ్ దేవరకొండ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఈ నెల 31న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ ఫస్ట్ పార్ట్ వస్తుంది. సినిమా ఒకటి రెండుసార్లు రిలీజ్ డేట్ లు అనుకుని వాయిదా పడినా నెలాఖరికి సినీ ప్రియులతో పాటుగా విజయ్ ఫ్యాన్స్ కి ఒక మంచి మాస్ ఫీస్ట్ అందిస్తుందని అంటున్నారు. నిర్మాత నాగ వంశీ అయితే ఈ సినిమాపై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

కింగ్ డం సినిమా మొదటి టీజర్ తోనే సినిమాపై బజ్ పెరిగింది. గౌతం, విజయ్ కలిసి ఏదో అద్భుతాన్నే చేసేలా ఉన్నారని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. ఇక వస్తున్న ప్రమోషనల్ కంటేంట్ అంతా కూడా సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్తుంది. మరి విజయ్ కి కింగ్ డం బాక్సాఫీస్ పై తన సత్తా చాటేలా చేస్తుందా లేదా అన్నది చూడాలి.

Full View
Tags:    

Similar News