ఆ రికార్డును అందుకోబోతున్న ఏకైక డైరెక్టర్!

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నవ్వుల సందడిని, మాస్ హంగామాను కలిపి అందించడంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి రూటే వేరు.

Update: 2026-06-16 02:30 GMT

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నవ్వుల సందడిని, మాస్ హంగామాను కలిపి అందించడంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి రూటే వేరు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ వంటి అగ్ర హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన అనిల్.. ఇప్పుడు తన ఫోకస్ కింగ్ నాగార్జునపై పెట్టారు. ఒకే తరం నాటి నలుగురు టాప్ హీరోలను డైరెక్ట్ చేసిన అరుదైన దర్శకుడిగా అనిల్ రావిపూడి రికార్డు సృష్టించబోతున్నారు. దీనిపై ఆయన తాజాగా ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ విశేషాలు చూద్దాం..

నలుగురు దిగ్గజాలు.. ఒకే ఒక దర్శకుడు:

తెలుగు సినీ పరిశ్రమను దశాబ్దాలుగా ఏలుతున్న నలుగురు పిల్లర్స్ అంటే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున అని అందరికీ తెలుసు. అయితే, ఇప్పటి తరం దర్శకులలో ఈ నలుగురితో సినిమాలు చేయడం అనేది మామూలు విషయం కాదు. తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న అనిల్ రావిపూడి.. ఇప్పటికే తాను ముగ్గురు సీనియర్ స్టార్లతో హిట్లు కొట్టానని, త్వరలోనే నాగార్జున గారితో కూడా సినిమా చేయబోతున్నానని ప్రకటించారు. దీంతో ఈ 'రేర్ ఫీట్' సాధించబోతున్న డైరెక్టర్ గా అనిల్ వార్తల్లో నిలిచారు.

ఆ ముగ్గురితో ఆల్రెడీ హిట్లు.. ఇక నాగ్ మిగిలారు:

అనిల్ రావిపూడి ఇప్పటికే బాలకృష్ణతో 'భగవంత్ కేసరి' లాంటి ఎమోషనల్ హిట్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి తో మన శంకర వర ప్రసాద్ గా హిట్ ఇచ్చారు. ఇక విక్టరీ వెంకటేష్, తో గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో సూపర్ హిట్ అందుకున్నారు.ఇక ఇప్పడు మరోసారి వెంకటేష్, కళ్యాణ్ రామ్ తో మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు. ఇక ఇప్పుడు నాగార్జునతో చేయబోయే సినిమా పట్టాలెక్కితే.. టాలీవుడ్ లో ఒకే జనరేషన్ కి చెందిన నలుగురు టాప్ హీరోలను డైరెక్ట్ చేసిన వ్యక్తిగా అనిల్ రావిపూడి పేరు చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. సీనియర్ నటి రాధా సమక్షంలో అనిల్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించడం విశేషం.

ఫ్యాన్స్ కోరిక.. మళ్ళీ ఆ 'హలో బ్రదర్' మ్యాజిక్:

ఈ వార్త బయటకు రావడంతో అక్కినేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. నాగార్జునలోని కామెడీ టైమింగ్ ను, మాస్ యాటిట్యూడ్ ను అనిల్ రావిపూడి మాత్రమే పర్ఫెక్ట్ గా వాడుకోగలరని వారు భావిస్తున్నారు. ఇక 'హలో బ్రదర్', 'ఘరానా బుల్లోడు' వంటి సినిమాల్లో నాగార్జున ఎంత సందడి చేశారో.. మళ్ళీ అదే స్థాయి వినోదాన్ని అనిల్ సినిమాలో చూడాలని ఉందని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

వయసు పెరిగినా ఏమాత్రం క్రేజ్ తగ్గని కింగ్ నాగార్జున స్టైలిష్ యాక్టింగ్, అనిల్ రావిపూడి స్పీడ్ కలిస్తే రికార్డులు తిరగరాయాల్సిందే. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ.. అతి త్వరలోనే ఈ క్రేజీ కాంబోపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఒక తరం అగ్ర హీరోలందరితో పని చేసిన దర్శకుడిగా అనిల్ రావిపూడి అందుకునే ఈ రికార్డు టాలీవుడ్ లో ఒక మైలురాయిగా నిలవనుంది.

Tags:    

Similar News