డాటర్ నేమ్ ను రివీల్ చేసిన బాలీవుడ్ స్టార్ కపుల్... పేరుకి అర్థమేంటంటే?
బాలీవుడ్ క్యూట్ అండ్ స్వీట్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ రీసెంట్ గానే పేరెంట్స్ గా ప్రమోషన్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.;
బాలీవుడ్ క్యూట్ అండ్ స్వీట్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ రీసెంట్ గానే పేరెంట్స్ గా ప్రమోషన్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. జులైలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా, సిద్ధార్థ్ తమ కూతురి పేరు విషయంలో ఇన్ని రోజులు సస్పెన్స్ ను మెయిన్‌టెయిన్ చేశారు. ఇప్పుడా సస్పెన్స్ కు తెర దించుతూ తమ ముద్దుల పాపాయి పేరుని సోషల్ మీడియాలో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
కూతురి పేరుని రివీల్ చేసిన స్టార్ కపుల్
సిద్ధార్థ్, కియారా తమ పాపకు ఓ డిఫరెంట్ నేమ్ ను పెట్టడంతో ఆ పేరుకు ఉన్న అర్థమేంటో తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ స్టార్ కపుల్ తమ పాపకు సరాయా మల్హోత్రా అనే పేరుని పెట్టినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఓ అందమైన ఫోటోను షేర్ చేశారు. కియారా, సిద్ధార్థ్ తమ కూతురి పాదాలను తమ చేతుల్లోకి తీసుకున్న ఈ ఫోటో ఎంతో అందంగా ఉంది.
ఈ ఫోటో పెట్టిన కొన్ని క్షణాల్లోనే నెట్టింట వైరల్ అవగా, సెలబ్రిటీ జంటకు ఈ పోస్ట్ కింద ఫ్యాన్స్, సెలబ్రిటీల నుంచి అభినందనలు వెల్లివెత్తుతున్నాయి. ఫ్యాన్స్ ఎంతోకాలంగా వెయిట్ చేస్తున్న పోస్ట్ చూసేసరికి వారి ఎగ్జైట్‌మెంట్ కు హద్దుల్లేకుండా పోయాయి. అయితే సరాయా అనేది హబ్రూ పదం నుంచి వచ్చిందని, దానికి యువరాణి అనే అర్థమొస్తుందని తెలుస్తోంది.
తమ ఇంటికి సరాయా రూపంలో మహాలక్ష్మి వచ్చిందని, తనను ప్రిన్సెస్ లా చూసుకుంటామనే ఉద్దేశంతోనే ఈ పేరు పెట్టారని తెలుస్తోంది. ఈ ఫోటోను షేర్ చేస్తూ దేవుడు తమకు ఇచ్చి వరం మా యువరాణి సరాయా అంటూ ఎమోషనల్ క్యాప్షన్ ను చేశారు. రీసెంట్ గా వార్2 సినిమాతో ఆడియన్స్ ను అలరించిన కియారా, త్వరలోనే రణ్‌వీర్ సింగ్ తో కలిసి డాన్ రీమేక్ లో కనిపించనుంది. ఇక సిద్ధార్థ్ విషయానికొస్తే పరమ్ సుందరి మూవీతో ప్రేక్షకుల్ని పలకరించారు.