పార్టీలో ప్రియుడితో దొరికిపోయిన నటి
కొంతకాలంగా కపూర్ సిస్టర్స్ బోయ్ ఫ్రెండ్స్ గురించి బాలీవుడ్ మీడియాలో ఎక్కువగా చర్చ కొనసాగుతోంది.;
కొంతకాలంగా కపూర్ సిస్టర్స్ బోయ్ ఫ్రెండ్స్ గురించి బాలీవుడ్ మీడియాలో ఎక్కువగా చర్చ కొనసాగుతోంది. శ్రీదేవి ఇద్దరు కుమార్తెలకు బోయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ తన ప్రియుడు శిఖర్ పహారియాను విడిచి ఉండలేదు. అదే సమయంలో రెండో కుమార్తె ఖుషి కపూర్ కూడా తన ప్రియుడు వేదాంగ్ రైనాను బహిరంగంగానే పరిచయం చేసింది.
జాన్వీ ఎక్కువగా శిఖర్ తో కలిసి తిరుమలకు వెళ్లడంతో ఈ జంట ఎక్కువగా పాపులరైంది. అయితే తన సోదరిలా ఖుషీ రిపీటెడ్ గా ప్రియుడితో కలిసి కనిపించదు. కానీ ఆ ఇద్దరి మధ్యా ప్రేమబంధం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఖుషి ప్రియుడు వేదంగ్ రైనా ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. అతడు లండన్‌లో తన సన్నిహితులతో ప్రత్యేకంగా బర్త్ డే వేడుకను జరుపుకున్నట్లు సమాచారం. పరస్పర స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ పుట్టినరోజు వేడుకలో ఖుషి షోస్టాపర్ గా నిలిచింది.
ఈ జంటను చూడగానే విడదీయరాని బంధం వీరిది! అంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వేదాంగ్ పుట్టినరోజు వేడుక నుండి కొన్ని ఫోటోలను పోస్ట్ చేయగా, వీటిలో ఖుషీ ప్రాణ స్నేహితురాలు అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ కూడా పార్టీలో కనిపించారు. వేదాంగ్ నల్ల రంగు దుస్తుల్లో కనిపించగా, అతడిని చూస్తూ ఖుషీ చిద్విలాసంగా పెద్దగా నవ్వులు చిందిస్తోంది.
ఖుషీ, జాన్వీ కపూర్‌ల ప్రాణ స్నేహితుడు ఓర్రీ కూడా ఫ్రెండ్స్ క్లబ్‌లో చేరాడు. అతడు వేదంగ్ పుట్టినరోజు వేడుక నుండి ఒక వీడియోను పోస్ట్ చేశాడు. అందులో వేదంగ్ తన ఇతర స్నేహితులతో కలిసి హనీ సింగ్ హిట్ ట్రాక్, మిలియనీర్‌కి స్టెప్పులేస్తూ కనిపించారు. జోయా అక్తర్ ది ఆర్చీస్‌తో ఖుషీ ఓటీటీకి పరిచయమైంది. ఈ సిరీస్ తోనే వేదంగ్ రైనాతో పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి పనిచేస్తున్న క్రమంలో ఒకరినొకరు ప్రేమించుకున్నారని కథనాలొచ్చాయి.