ఖుషీ కపూర్ స్టైలిష్ అండ్ బోల్డ్ లుక్ వైరల్
ఈ రాయల్ అండ్ క్లాసిక్ లుక్ కోసం డిజైనర్ మోహిత్ రాయ్‌తో పాటు ఫ్యాషన్ స్టైలిస్ట్ శుభి కుమార్ కలిసి పనిచేశారు.
బాలీవుడ్ యంగ్ ఫ్యాషన్ ఐకాన్ సిస్టర్స్ గా జాన్వీ- ఖుషి ఎంతగా పాపులరయ్యారో చెప్పాల్సిన పని లేదు. ఇక తన సోదరి జాన్వీని మించిపోయి ప్రయోగాలు చేయడంలో ఖుషి ముందుంటుంది. కపూర్ బ్యూటీ మరోసారి తన గ్లామరస్ లుక్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇటీవల ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్ మోహిత్ రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఖుషీ కపూర్ సరికొత్త ఫోటోషూట్‌కు సంబంధించిన వివరాలను షేర్ చేసారు. ఈ ఫోటోలలో ఖుషీ కపూర్ గులాబీ రేకులాంటి (రోజ్ పెటల్) రంగు డిజైనర్ డ్రెస్సులో దేవకన్యలా మెరిసిపోతూ అభిమానులను ఆకట్టుకుంది.
ఈ రాయల్ అండ్ క్లాసిక్ లుక్ కోసం డిజైనర్ మోహిత్ రాయ్‌తో పాటు ఫ్యాషన్ స్టైలిస్ట్ శుభి కుమార్ కలిసి పనిచేశారు. భారతదేశపు అగ్రశ్రేణి ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన ఈ అద్భుతమైన ఔట్‌ఫిట్‌లో ఖుషీ కపూర్ మెరవగా, దానికి తగ్గట్టుగా `జగత్ జ్యువెలర్స్` కి చెందిన రాయల్ జ్యువెలరీ.. `దూ అమూర్` బ్రాండ్ హ్యాండ్‌బ్యాగ్‌ను మ్యాచ్ చేశారు. ఫోటోగ్రాఫర్ డిర్క్ అలెక్సాండర్ ఈ ఫోటోలను ఎంతో అందంగా తెరకెక్కించారు.
పోస్ట్ వైరల్ అయిన కొద్దిసేపటికే అభిమానులు, నెటిజన్ల నుండి కామెంట్ల వర్షం కురిసింది. సో జార్జియస్.. వెరీ బ్యూటిఫుల్ ..రెడ్ రోజ్ అంటూ కామెంట్లు పెడుతుంటే.. కొందరు నెటిజన్లు సరదాగా ఫన్నీ కామెంట్లు కూడా జోడించారు. పర్సనాలిటీ రైట్స్ వివాదాల నడుమ ఖుషీ కపూర్ ఫ్యాషన్ ప్రపంచంలో తన మార్క్‌ను నిలబెట్టుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. జాన్వీ-ఖుషీ కపూర్ లకు పర్సనాలిటీ రైట్స్ విషయంలో కోర్టు మద్ధతుగా నిలిచిన సంగతి తెలిసిందే.
జాన్వీతో పోలిస్తే కెరీర్ కాస్త నెమ్మదిగానే..
అతిలోక సుందరి శ్రీదేవి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ల చిన్న కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన ఖుషీ కపూర్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన `ది ఆర్చీస్` (2023) సిరీస్‌తో నటిగా అరంగేట్రం చేశారు. ప్రముఖ దర్శకురాలు జోయా అక్తర్ తెరకెక్కించిన ఈ మల్టీస్టారర్ సినిమాలో బెట్టీ కూపర్ పాత్రలో నటించి ఖుషీ తన గ్లామర్, లుక్స్‌తో ఆకట్టుకున్నా సిరీస్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అనంతరం థియేట్రికల్ విడుదలలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు జునైద్ ఖాన్‌తో కలిసి `లవ్యాపా`, ఇబ్రహీం అలీ ఖాన్‌తో కలిసి `నాదానియాన్` వంటి రొమాంటిక్ కామిడీ సినిమాల్లో నటించారు. అయితే ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంలో విఫలమయ్యాయి. వరుస పరాజయాలు ఎదురైనా తన నటనలోని మెరుగుదల కోసం ఖుషీ కపూర్ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఇక టాలీవుడ్ ఎంట్రీ విషయానికి వస్తే... తల్లి శ్రీదేవికి, అక్క జాన్వీ కపూర్‌కు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మంచి క్రేజ్ కారణంగా ఖుషీ కపూర్ టాలీవుడ్ డెబ్యూపై పరిశ్రమలో భారీ ఆసక్తి నెలకొంది. గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం చేసే చిత్రంలో ఖుషీ నటిస్తుందనే ప్రచారాలు, ఊహాగానాలు గట్టిగా వినిపించాయి. అయితే ఇప్పటివరకు అధికారికంగా ఏ తెలుగు ప్రాజెక్ట్‌పై సంతకం చేయలేదు. ప్రస్తుతం హిందీ సినిమాలపైనే దృష్టి సారించిన ఖుషీ కపూర్ సరైన ప్రాజెక్ట్ మంచి కథ కుదిరితేనే టాలీవుడ్‌కి రావాలని భావిస్తున్నారట. ప్రస్తుత పరిస్థితులు... తన ప్రాజెక్ట్ ఎంపికలను బట్టి చూస్తే.. ఖుషీ కపూర్ తెలుగు తెరపై మెరవడానికి కనీసం మరో సంవత్సరం నుండి రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.