శ్రీరాముడి పాత్రపై ఓపెన్ అయిన రణ్‌బీర్ కపూర్!

మరొక సినిమా ఆఫర్ ... ఎగ్జైటింగ్ రోల్ మాత్రమే కాదని, ఒక గొప్ప బాధ్యత అని పేర్కొన్నారు. `ధర్మో రక్షతి రక్షితః` అనే వైదిక సూత్రాన్ని గుర్తుచేసుకుంటూ పాత్రలో నటనకంటే స్వచ్ఛత, నమ్మకమే ప్రధానమని తెలిపారు.

Update: 2026-09-29 07:34 GMT

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు నితేష్ తివారీ తెర‌కెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం `రామాయణం`. ఇటీవల విడుదల అయిన బిహైండ్ ది సీన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో శ్రీరాముడి పాత్రలో న‌టిస్తోన్న స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తన పాత్ర ప్రాముఖ్యత ..ప్రాజెక్ట్ వెనుక ఉన్న భావోద్వేగాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రామాయ‌ణంలో అవ‌కాశం అన్న‌ది మరొక సినిమా ఆఫర్ ... ఎగ్జైటింగ్ రోల్ మాత్రమే కాదని, ఒక గొప్ప బాధ్యత అని పేర్కొన్నారు. `ధర్మో రక్షతి రక్షితః` అనే వైదిక సూత్రాన్ని గుర్తుచేసుకుంటూ పాత్రలో నటనకంటే స్వచ్ఛత, నమ్మకమే ప్రధానమని తెలిపారు.

రాముడి రూపంపై ప్రతి భక్తుడికి ప్రత్యేకమైన భావన ఉంటుందని, కాబట్టి ప్రేక్షకుల విశ్వాసానికి తగినట్లుగా నటించడమే తన ముందున్న అతిపెద్ద సవాలని వ్యాఖ్యానించారు. టీవీ రామాయణంలో రాముడిగా నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సీనియర్ నటుడు అరుణ్ గోవిల్ తనకు పెద్ద ప్రేరణ అని రణ్‌బీర్ తెలిపారు. `క్షమా ధర్మ, క్షమా యజ్ఞం, క్షమా వేదం...` అనే మాటను ప్రస్తావిస్తూ శ్రీరాముడి నిజమైన శక్తి ఆయన విల్లు కాదని ఎదుటివారిని క్షమించే గొప్ప గుణమే అసలైన శక్తినని రణ్‌బీర్ విశ్లేషించారు. ఈ కోణంలోనే ర‌ణ‌బీర్ పాత్రను అర్థం చేసుకుని ముందుకు సాగుతున్నాన‌న్నారు.

ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు దిగ్గజ నిపుణులను నిర్మాత నమిత్ మల్హోత్రా ఒకే వేదికపైకి తెచ్చారని రణ్‌బీర్ తెలిపారు. బాడీ లాంగ్వేజ్ శిక్షణ కోసం హాలీవుడ్ దిగ్గజం టెర్రీ నోటరీ, హై-వోల్టేజ్ యాక్షన్ సీన్ల కోసం యాక్షన్ డైరెక్టర్ గుయ్ నోరిస్ పనిచేస్తున్నారన్నారు. ఒక యాక్షన్ డైరెక్టర్ అయి ఉండి కూడా గుయ్ నోరిస్ రాముడి భావోద్వేగాలకు పెద్దపీట వేయడం తనకు ఎంతో ముచ్చట కలిగించిందన్నారు. `ప్రతీరోజూ షూటింగ్‌కి వెళ్లేటప్పుడు నేను ఒకటే గుర్తుచేసుకుంటాను. నా పని శ్రీరాముడి అంతటి మహోన్నత స్థానానికి తగినంత యోగ్యుడిగా మారడం కాదు. తరతరాలుగా ఈ రామాయణ కథపై, శ్రీరాముడిపై ప్రజలు ఉంచిన అపారమైన నమ్మకానికి, విశ్వాసానికి అర్హుడిగా నిలవడమే ప్రధాన బాధ్యత` అని వినయంగా పేర్కొన్నారు.

అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఎపిక్ డ్రామా లో సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే, దశరథుడిగా అరుణ్ గోవిల్, రావణాసురుడిగా యష్ న‌టిస్తున్నారు. అలాగే సన్నీ డియోల్, వివేక్ ఒబెరాయ్, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. రెండు భాగాలుగా తెర‌కెక్కుతోన్న రామాయ‌ణం మొద‌టి భాగం దీపావ‌ళి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Tags:    

Similar News