కేతిక శ‌ర్మ బోల్డ్ ఆఫ‌ర్ కి నో చెప్పిందా?

ఢిల్లీ బ్యూటీ కేతిక శ‌ర్మ కెరీర్ ప్రారంభించి ఐదేళ్లు అవుతోన్న సంగ‌తి తెలిసిందే. చెప్పుకోవ‌డానికి ఐదారు సినిమాలు చేసింది.;

Update: 2025-08-18 08:30 GMT

ఢిల్లీ బ్యూటీ కేతిక శ‌ర్మ కెరీర్ ప్రారంభించి ఐదేళ్లు అవుతోన్న సంగ‌తి తెలిసిందే. చెప్పుకోవ‌డానికి ఐదారు సినిమాలు చేసింది. కానీ వాటిలో హిట్ అయిన‌వి ఎన్ని అంటే? క‌నిపించ‌డం క‌ష్ట‌మే. ఇటీవ‌లే రిలీజ్ అయిన `సింగిల్` మాత్ర‌మే అమ్మ‌డి కెరీర్ లో తొలి హిట్. ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ లో కేతిక పాత్ర‌కు మంచి మార్కు లే ప‌డ్డాయి. చ‌బ్బీ లుక్ లో యువ‌త‌ని ఆక‌ట్టుకుంటుంది. న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న రోల్ కావ‌డంతో అంద‌రికీ క‌నెక్ట్ అయింది. దీంతో అమ్మ‌డికి కొత్త అవ‌కాశాలు ప్రారంభ‌మైన‌ట్లుక‌నిపిస్తుంది.

ప్ర‌స్తుతం రాజేష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తోంది. అలాగే కోలీవుడ్ లో కూడా ఛాన్సులొస్తున్నాయి. అందం, అభిన‌య గ‌ల నాయిక కావ‌డంతో ప్రోత్స‌హించే వారు వెంట ప‌డుతుతున్నారు. ఈనేప‌థ్యంలో తాజాగా టాలీవుడ్లో ఓ నిర్మాత అప్రోచ్ అయి ఓఛాన్స్ ఆఫ‌ర్ చేసాడుట‌. అయితే అది బోల్డ్ కంటెంట్ ఉన్న చిత్రం కావ‌డంతో కేతిక స్టోరీ విని రిజెక్ట్ చేసిందిట‌. క‌థ‌లో కేతిక పాత్ర బాగా బోల్డ్ గా ఉంటుందని.. ద్వితి యార్ధం క‌థ‌లో మ‌రింత‌గా బోల్డ్ నెస్ హైలైట్ అవుతుంద‌న్న కార‌ణంగా తిర‌స్క‌రించిన‌ట్లు తెలిసింది.

కేతిక ఇమేజ్ ఆధారంగా రెడీ చేసిన క‌థ కావ‌డంతో ఆమె ఒప్పుకుంటుంద‌ని న‌మ్మ‌కంతో స‌ద‌రు ద‌ర్శ‌క నిర్మాత కాన్పిడెంట్ గా ముందుకెళ్లినా? ఊహించ‌ని స‌మాధానం చెప్పింద‌ని స‌ద‌రు ద‌ర్శ‌క నిర్మాత బ‌య‌ట చెబుతున్నాడు. దీంతో ఇప్పుడాయ‌న మ‌రో నాయిక‌ను వెతుక్కునే పనిలో ఉన్న‌ట్లు తెలిపాడు. ఆ హీరో యిన్ కూడా అచ్చంగా కేతిక లుక్ లోనే ఉండే వాళ్ల‌నే ఎంపిక చేస్తానంటున్నాడు.

అలాంటి భామ దొరికితే ఒకే లేదంటే? క‌థ‌లో మ‌ళ్లీ మార్పులు చేసి కొత్త భామ కోసం ట్రై చేస్తాన‌న్నాడు. హీరోయి న్ల‌ను గుడ్డిగా న‌మ్మి ముందుకెళ్తే ఇలా ఉంటుంది? అన్న‌ది ఇదో అనుభ‌వంగా చెప్పుకొచ్చాడు. ఏన‌టి అయినా పోషించే పాత్ర మ‌న‌సుకు న‌చ్చితేనే అంగీక‌రిస్తారు. మ‌న‌సు చంపుకుని న‌టించ‌డానికి ఏ న‌టి సాహ‌సించ‌ద‌న్న‌ది గుర్తించ‌డం అంతే అవ‌స‌రం.

Tags:    

Similar News