మళ్లీ లాక్ డౌన్ వస్తే అతనితో కలిసి ఉంటా
ఇంటర్వ్యూలో కీర్తిని ఒక వేళ మళ్లీ లాక్ డౌన్ వస్తే ఏ హీరోతో ఉండటానికి ఇష్టపడతారని సుమ అడగ్గా, దానికి కీర్తి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నాని పేరు చెప్పేశారు.;
నేను శైలజ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కీర్తి సురేష్ మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన కీర్తి సురేష్ అలనాటి తార సావిత్ర జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో నటించి ఏకంగా నేషనల్ అవార్డునే సొంతం చేసుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా కీర్తి మంచి హీరోయిన్ గా గుర్తింపు అందుకున్నారు.
రీసెంట్ గానే బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి, ఆ సినిమాతో ఊహించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. కాగా కీర్తి సురేష్ ప్రస్తుతం ఉప్పు కప్పురంబు అనే సినిమాలో నటించారు.
అని శశి దర్శకత్వంలో సుహాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రైమ్ వీడియోలో ఉప్పు కప్పురంబు జులై 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు కీర్తి సురేష్.
ఇంటర్వ్యూలో కీర్తిని ఒక వేళ మళ్లీ లాక్ డౌన్ వస్తే ఏ హీరోతో ఉండటానికి ఇష్టపడతారని సుమ అడగ్గా, దానికి కీర్తి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నాని పేరు చెప్పేశారు. నాని, తన వైఫ్ అంజు, నాని కొడుకు అర్జున్ తో కలిసి ఉండటానికి ఇష్టపడతానని కీర్తి చెప్పారు. కీర్తి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, కీర్తి సురేష్- నాని మంచి ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి నేను లోకల్, దసరా లాంటి సినిమాల్లో నటించగా, ఆ షూటింగ్ టైమ్ లో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. కేవలం నానితోనే కాకుండా నాని ఫ్యామిలీతో కూడా కీర్తి చాలా సన్నిహితంగా ఉంటారు. రీసెంట్ గా ఉప్పు కప్పురంబు సినిమా ట్రైలర్ చూశాక దాన్ని షేర్ చేస్తూ నాని కీర్తిని ప్రశంసిస్తూ చిత్ర యూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్ చెప్పిన సంగతి తెలిసిందే.