ప్యారడైజ్‌లో కీర్తి సురేష్ పాత్రపై క్లారిటీ ఇదే..!
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో 'దసరా' వచ్చి మూడు ఏళ్లు దాటినా ఇప్పటికీ ఆ సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం.
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో 'దసరా' వచ్చి మూడు ఏళ్లు దాటినా ఇప్పటికీ ఆ సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆ సినిమాలోని నాని పాత్ర, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల టేకింగ్, స్క్రీన్‌ప్లే ఇలా ప్రతి ఒక్కదాని గురించి చర్చించుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు దసరా కాంబోలో రూపొందిన 'ది ప్యారడైజ్' మూవీ విడుదలకు సిద్ధం అయింది. నాని హీరోగా కాయాదు లోహర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా నుంచి వచ్చిన ఆయా షేర్ పాట ఏ స్థాయి చాట్ బస్టర్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఏశనాగుల గడ్డ అంటూ మరో పాటను తీసుకు వచ్చిన ప్యారడైజ్ టీం సినిమాపై అంచనాలు మరింతగా పెంచారు. ఈ పాటలో 'దసరా' హీరోయిన్ కీర్తి సురేష్ ను చూపించడంతో అందరికీ మైండ్ పోతుంది. కీర్తి సురేష్ లుక్, ఆమె డాన్స్ ఇలా ప్రతి ఒక్క దాని గురించి సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చర్చ జరుగుతోంది.
ది ప్యారడైజ్ మూవీలో కీర్తి సురేష్ పాత్ర పై...
ది ప్యారడైజ్ మూవీలో కీర్తి సురేష్ పాత్ర గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా కీర్తి సురేష్ ను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల 15 నుంచి 20 నిమిషాల పాటు కీలకమైన సన్నివేశాల్లో చూపించబోతున్నాడు అంటూ కొందరు పోస్ట్‌లు చేస్తున్నాడు. దసరా హిట్ సెంటిమెంట్ వర్కౌట్ కావడంతో పాటు, కీర్తి సురేష్‌ను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల లక్కీ ఛామ్‌గా భావిస్తున్నాడని, అందుకే ఈ సినిమాలో ఆమెను కీలకమైన పాత్ర కోసం గెస్ట్ రోల్‌లో చూపించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. శ్రీకాంత్ ఓదెలపై ఉన్న అభిమానం, నానిపై ఉన్న గౌరవంతో ఈ సినిమాలో చిన్న పాత్ర అయినా కీర్తి సురేష్ నటించేందుకు ఒప్పుకుంది, అలాగే ప్రత్యేక పాటలో నానితో కలిసి మాస్ డాన్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ ఇండస్ట్రీ వర్గాల్లోనూ కొందరు మాట్లాడుకుంటున్నారు. దాంతో కీర్తి సురేష్ ది ప్యారడైజ్‌లో ఎంత సమయం ఉంటుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఏశనాగుల గడ్డ మీద పాటలో కీర్తి సురేష్...
చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఆఫ్ ది రికార్డ్ వారు చెప్పిన దాని ప్రకారం 'ది ప్యారడైజ్' మూవీలో కీర్తి సురేష్ కేవలం పాట వరకే పరిమితం అవుతుంది. స్క్రీన్ మీద ఆమె దాదాపుగా నాలుగు నిమిషాలు మాత్రమే కనిపించే అవకాశం ఉంది. ఆ తర్వాత కానీ, అంతకు ముందు సీన్స్‌లో కానీ కీర్తి సురేష్ పాత్రకు సంబంధించిన ప్రస్థావన కూడా ఉండదని వారు క్లారిటీ ఇచ్చారు. కీర్తి సురేష్‌ను కేవలం ఐటెం సాంగ్ కోసం మాత్రమే తీసుకున్నారు తప్ప సినిమాలో ఆమె పాత్రకు స్కోప్ లేదని, అందుకే సీన్స్‌లో ఆమె కనిపించబోవడం లేదని కూడా యూనిట్ సభ్యులు ఆఫ్ ది రికార్డ్ క్లారిటీ ఇస్తున్నారు. కీర్తి సురేష్ తో ఐటెం సాంగ్ చేయించడం వల్ల సినిమాకు బజ్ క్రియేట్ కావడంతో పాటు, పబ్లిసిటీ సైతం బాగుంటుంది అనే ఉద్దేశంతో శ్రీకాంత్ ఈ నిర్ణయాన్ని తీసుకుని ఉంటాడు అనేది కొందరి అభిప్రాయం.
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో ది ప్యారడైజ్...
నాని ఇప్పటికే నేను శైలజ, దసరా సినిమాల్లో కీర్తి సురేష్‌తో కలిసి నటించాడు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అందుకే ఏశనాగుల పాట అంత బాగా వచ్చిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పాట షూట్ తర్వాత ప్రమోషన్‌లోనూ కీర్తి సురేష్‌తో కలిసి నాని సందడి చేసిన వీడియోలు ఉన్నాయి. వీరి కెమిస్ట్రీ ఇప్పటికే వర్కౌట్ అయింది కనుక ఏశనాగుల పాటకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అనేది విశ్లేషకుల మాట. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పెట్టుకున్న నమ్మకంను కీర్తి సురేష్ వమ్ము చేయకుండా పాటలో అద్భుతమైన లుక్‌తో పాటు, మాస్ స్టెప్స్‌తో అదరగొట్టింది. సినిమాలో ఈ పాట వచ్చిన సమయంలో ప్రేక్షకులు కచ్చితంగా సీట్లలో కూర్చోరు అని నాని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. నాని, కీర్తి సురేష్‌ల కాంబోకు ది ప్యారడైజ్‌తో మరో హిట్ పడితే కచ్చితంగా జంటగా మరో సినిమా నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ది ప్యారడైజ్ మూవీలో నాని, కీర్తి కాంబో సీన్స్ లేకున్నా, పాటలో కనిపించి కన్నుల విందు చేస్తారు, ఈ సినిమా తర్వాత మళ్లీ పూర్తి స్థాయి హీరో, హీరోయిన్‌గా వీరు కలిసి నటిస్తారేమో చూడాలి.