హీరోయిన్లతో వినూత్న ప్రమోషన్ చేస్తున్న అనిల్ రావిపూడి

అయితే, షూటింగ్ ఊపు అందుకోకముందే ఈ సినిమా ప్రమోషన్ల డోస్ పెంచేసిన అనిల్ రావిపూడి.. జీవీ ప్రకాష్ కుమార్‌తో చేసిన ఫన్నీ వీడియో తర్వాత, ఇప్పుడు హీరోయిన్లతో కలిసి మరో వినూత్నమైన వీడియో ప్లాన్ చేసినట్లు నెట్టింట గట్టిగా టాక్ నడుస్తోంది.

Update: 2026-06-21 03:59 GMT

టాలీవుడ్‌లో కేవలం సినిమాలతోనే కాదు, తన వెరైటీ ప్రమోషన్లతో కూడా ప్రేక్షకులను నవ్వించగల క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి. తాజాగా విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో ఆయన ఒక భారీ మల్టీస్టారర్ సినిమాను అఫీషియల్‌గా ప్రారంభించారు. అయితే, షూటింగ్ ఊపు అందుకోకముందే ఈ సినిమా ప్రమోషన్ల డోస్ పెంచేసిన అనిల్ రావిపూడి.. జీవీ ప్రకాష్ కుమార్‌తో చేసిన ఫన్నీ వీడియో తర్వాత, ఇప్పుడు హీరోయిన్లతో కలిసి మరో వినూత్నమైన వీడియో ప్లాన్ చేసినట్లు నెట్టింట గట్టిగా టాక్ నడుస్తోంది.

జీవీ ప్రకాష్‌ను ఇసుకలో పూడ్చేసిన అనిల్ రావిపూడి:

సాధారణంగా అనిల్ రావిపూడి సినిమా అనౌన్స్ చేశారంటే అందులో ఏదో ఒక ఫన్ ఖాయం. రీసెంట్‌గా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా జాయిన్ అయిన జీవీ ప్రకాష్ కుమార్, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్‌లను ఇసుకలో గొంతు వరకు పూడ్చేసి.. పాత ‘అహ నా పెళ్ళంట’ సినిమా రేంజ్ కామెడీతో అనిల్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అంతేకాక మూవీ మొదలైన రోజు హీరో హీరోయిన్స్ తో చిన్న ఫన్నీ మూమెంట్ చేయించారు.. ఈ ఫన్నీ ప్రమోషనల్ వీడియోస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడమే కాకుండా, సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

ఈసారి హీరోయిన్లతో క్రేజీ ప్లాన్:

సంగీత దర్శకుడితో హంగామా సృష్టించిన ఈ డైరెక్టర్, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్‌కు రెడీ అవుతున్నారట. ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్న నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్, క్యూట్ బ్యూటీ కృతి శెట్టిలతో కలిసి అనిల్ రావిపూడి ఒక ఇంట్రెస్టింగ్ అండ్ హాస్యభరితమైన వీడియోను సిద్ధం చేసినట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక సినిమా కంటెంట్‌ను చాలా వినోదాత్మకంగా ప్రేక్షకులకు చేర్చాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

సంక్రాంతి 2027 బరిలో ‘వెంకీ,కళ్యాణ్ రామ్’ మల్టీస్టారర్:

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని వచ్చే ఏడాది 'సంక్రాంతి 2027' కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ పక్కన కృతి శెట్టి నటిస్తున్నారు. ఇక అనిల్ రావిపూడి మార్క్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, ఫుల్ ఎమోషన్స్ అండ్ కామెడీతో ఈ సినిమా కథ సాగనుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

సినిమాను కేవలం థియేటర్లలోనే కాదు, అంతకంటే ముందే ప్రమోషన్ల ద్వారా జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలో అనిల్ రావిపూడికి తెలిసినంతగా బహుశా ఎవరికీ తెలియదేమో, మరి జీవీ ప్రకాష్ వీడియోతో ఆల్రెడీ నవ్వులు పూయించిన అనిల్.. ఇప్పుడు కీర్తి సురేష్, కృతి శెట్టిలతో కలిసి ఎలాంటి ఫన్నీ మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలి. ఈ సరికొత్త హీరోయిన్స్ ప్రమోషనల్ వీడియో బయటకు వస్తే గనుక సోషల్ మీడియాలో రచ్చ జరగడం ఖాయం.

Tags:    

Similar News