ఎల్లమ్మ పునకాలు తెప్పించే ఎపిసోడ్..!
బలగం సూపర్ హిట్ అవ్వడంతో డైరెక్టర్ వేణు చేసే నెక్స్ట్ సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింది.;
బలగం సూపర్ హిట్ అవ్వడంతో డైరెక్టర్ వేణు చేసే నెక్స్ట్ సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింది. ఎల్లమ్మ టైటిల్ తో మరో కొత్త కథ అది కూడా మరోసారి రూటెడ్ స్టోరీ తో వస్తున్నాడు వేణు యెల్దండి. దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. నితిన్ తమ్ముడు రిలీజ్ అవ్వడమే ఆలస్యం ఇక పూర్తిస్థాయిలో ఎల్లమ్మ కు డేట్స్ ఇచ్చేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు.
ఎల్లమ్మ సినిమా కాస్టింగ్ విషయంలో కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తున్నారని తెలుస్తుంది. సినిమాలో ఫిమేల్ లీడ్ గా కీర్తి సురేష్ ఫైనల్ అయినట్టు టాక్. ఐతే చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది. ఈ సినిమా కోసం కీర్తి సురేష్ బల్క్ డేట్స్ కూడా బుక్ చేసుకున్నారని తెలుస్తుంది. ఇక త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఎల్లమ్మ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సినిమాలో చాలా గూస్ బంప్స్ సీన్స్ ప్లాన్ చేశాడట వేణు. ముఖ్యంగా ఎల్లమ్మ సినిమాలో కీర్తి సురేష్ అమ్మవారిగా పూనకంతో ఊగిపోయే సీన్ మాత్రం వేరే లెవెల్ అని అంటున్నారు. ఆ సీన్ ని వేణు చాలా బాగా రాసుకున్నాడని తప్పకుండా ఈ సీన్ వచ్చినప్పుడు ఆడియన్స్ కి కూడా పూనకాలు వస్తాయని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమా పర్ఫార్మెన్స్ తో కీర్తి సురేష్ కి మరోసారి నేషనల్ అవార్డ్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు.
ఆల్రెడీ మహానటితో కీర్తి సురేష్ నేషనల్ అవార్డు అందుకుంది. మరోసారి ఎల్లమ్మతో ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ చేస్తుందని అంటున్నారు. బలగం తర్వాత మరో అద్భుతమైన కథతో మరోసారి డైరెక్టర్ గా తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాడని వేణు యెల్దండి. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్న ఈ మూవీని 2026 సెకండ్ హాఫ్ రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. నితిన్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచేలా దీన్ని తీర్చిదిద్దబోతున్నారని తెలుస్తుంది. నితిన్ తమ్ముడు సినిమా కూడా దిల్ రాజు నిర్మించారు. తమ్ముడు తో హిట్ కొట్టి ఎల్లమ్మతో ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నారు. భారీ టార్గెట్ తో వస్తున్న ఎల్లమ్మ మిగతా విషయాలు త్వరలో తెలుస్తాయి.