• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భర్తతో మహానటి ఓనమ్.....

భర్తతో మహానటి ఓనమ్.. అక్కడ అదే హైలెట్!

| దక్షిణ భారతదేశ రాష్ట్రంగా పిలవబడే కేరళలో అతిపెద్ద పండుగగా పేరు సొంతం చేసుకుంది ఓనం.

By - Madhu Reddy
Update: 2025-09-06 07:35 GMT

దక్షిణ భారతదేశ రాష్ట్రంగా పిలవబడే కేరళలో అతిపెద్ద పండుగగా పేరు సొంతం చేసుకుంది ఓనం. మలయాళ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల అయిన చింగం (ఆగస్టు- సెప్టెంబర్)లో ఈ పండుగ వస్తుంది. సింహ మాసంలో వచ్చే శ్రవణా నక్షత్ర యుక్త రోజున ఓనం లేదా తిరువోణం పేరిట ఈ పండుగను జరుపుకుంటారు. కేరళలో దాదాపు పది రోజులపాటు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ముఖ్యంగా కేరళ ఆచార సాంప్రదాయాలతో ముడిపడి ఉన్న ఈ ఫెస్టివల్లో పువ్వుల మాలలు, భోజనం, సర్పాకారపు పడవ పందాలు, కైకొట్టికలి నృత్యం మొదలైనవన్నీ ఈ పండుగ ప్రత్యేకమని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది ఒక వ్యవసాయ పండుగ అని చెప్పవచ్చు.

పెళ్లి తర్వాత భర్తతో తొలి ఓనం జరుపుకున్న మహానటి..

అలాంటి ఈ ఓనం పండుగ ఇప్పుడు రానే వచ్చేసింది. పెద్ద ఎత్తున సెలబ్రిటీలు ఈ ఓనం పండుగను జరుపుకుంటున్నారు. అంతేకాదు ఈ పండుగ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. తమ ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఇక అందరిలాగే కీర్తి సురేష్ కూడా వివాహం తర్వాత తన భర్తతో కలిసి మొదటి ఓనం సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ వేదికగా ఆ ఫోటోలను పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. అందులో సాంప్రదాయమైన తెల్లటి చీర, గోల్డెన్ కలర్ బార్డర్ కలిగిన కేరళ సాంప్రదాయ చీరను ధరించింది. ఈ చీరపై పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ తో చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఈమె భర్త కూడా పట్టు పంచె , చొక్కా ధరించి తన అందాన్ని ఎలివేట్ చేశారు. ఇక స్టైలిష్ గా కూలింగ్ గ్లాసు పెట్టుకొని మరీ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ జంట.

ఓనం పండుగలో స్పెషల్ అట్రాక్షన్ గా..

ఇకపోతే ఇక్కడ మరో హైలెట్ గా నిలిచిన అంశం ఏమిటంటే.. కీర్తి సురేష్ తన పెట్ డాగ్స్ కి కూడా ఓనం సెలబ్రేషన్స్ లో భాగంగా సాంప్రదాయ దుస్తులు వేసింది. ఇక ఈ ఫెస్టివల్ లో ఈ పెట్ డాగ్స్ మరింత అట్రాక్షన్ గా నిలిచాయి అని చెప్పవచ్చు..మొత్తానికైతే వివాహం తర్వాత తమ నివాసంలో జరుపుకున్న తొలి ఓనం కావడంతో కీర్తి సురేష్ తన ఆనందాన్ని ఇటు అభిమానులతో కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

కీర్తి సురేష్ వైవాహిక జీవితం..

తన చిరకాల స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ ను 2024 డిసెంబర్ 12న గోవాలోని ఒక ప్రైవేట్ రిసార్ట్లో పెళ్లి చేసుకుంది కీర్తి సురేష్. 15 సంవత్సరాలుగా పరిచయం ఉన్న ఈ జంట ఎట్టకేలకు గత ఏడాది వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు.

కీర్తి సురేష్ సినిమా కెరియర్..

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో కెరియర్ మొదలు పెట్టిన కీర్తి సురేష్.. ప్రముఖ మలయాళ నిర్మాత జి.సురేష్ కుమార్, ప్రముఖ నటి మేనక ల కుమార్తె. 2000 సంవత్సరంలోనే బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె.. 2013లో విడుదలైన 'గీతాంజలి' అనే మలయాళ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు, తమిళ్ చిత్రాలలో నటిస్తూ మరింత బిజీగా మారిపోయింది. ఇప్పుడు హిందీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది కానీ మొదటి సినిమానే డిజాస్టర్ గా నిలిచింది.

Tags:    
  • KeerthySuresh 
  • Onam2025 
  • FirstMarriedOnam 
  • Kerala 
  • OnamCelebration 
  • కీర్తి సురేష్ 
  • ఓనం పండుగ 
  • వివాహం తర్వాత తొలి ఓనం 
  • కేరళ సాంప్రదాయ చీర 

Similar News

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS