బాలీవుడ్ లో క‌ళావ‌తికి మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్!

కీర్తి సురేష్ అలియాస్ క‌ళావ‌తి `బేబీజాన్` తో బాలీవుడ్ లో లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇందులో వ‌రుణ్ ధావ‌న్ కి జోడీగా న‌టించింది.;

Update: 2025-05-14 08:07 GMT

కీర్తి సురేష్ అలియాస్ క‌ళావ‌తి `బేబీజాన్` తో బాలీవుడ్ లో లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇందులో వ‌రుణ్ ధావ‌న్ కి జోడీగా న‌టించింది. భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రిలీజ్ అయిన చిత్రం మాత్రం ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. దీంతో క‌ళావ‌తికి ఆరంభంలో చేదు అనుభ‌వం త‌ప్ప‌లేదు. అయినా కీర్తికి కొత్త ఛాన్సులకేమి కొద‌వ‌లేద‌న్న‌ట్లు బ్యాక్ టూ బ్యాక్ ఛాన్సులందుకుంటుంద‌నే ప్ర‌చారం బాలీవుడ్ మీడియాలో పీక్స్ లో జ‌రుగుతోంది.

ఇప్ప‌టికే కొన్ని ప్రాజెక్ట్ ల‌కు సంబంధించి అగ్రిమెంట్ జ‌రిగిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఆ సినిమాలేంటి? అన్న‌ది బ‌య‌ట‌కు రాలేదు కానీ తాజాగా రాజ్ కుమార్ రావుకి జోడీగా మరో చిత్రంలో ఎంపికైన‌ట్లు తెలుస్తోంది. విద్యా వ్య‌వ‌స్థ నేప‌త్యంలో రాజ్ కుమార్ రావు హీరోగా ఓ సినిమాకు స‌న్నాహాలు జ‌రుగు తున్నాయి. ఈ చిత్రాన్ని ఆయ‌నే సొంత బ్యాన‌ర్లో నిర్మిస్తున్నారు. `సెక్టార్ 36` ఫేం ఆదిత్యా నింబాల్క‌ర్ తెర‌కెక్కిస్తున్నారు.

ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఎంపికైంది. విద్యావ్య‌వ‌స్థ‌లో కుంభ‌కోణాన్ని బ‌య‌ట పెట్టే పాత్ర‌లో కీర్తి క‌నిపించ‌నుంది. జూన్ లోనే చిత్రీక‌ర‌ణ‌కు రంగం సిద్ద‌మ‌వుతోంది. ఇదే నెల‌లో కీర్తి సీక్రెట్ గా ఉంచిన మ‌రో ప్రాజెక్ట్ కూడా లాంచ్ అవుతుంద‌ని స‌మాచారం. మొత్తానికి అమ్మ‌డికి తొలి సినిమాతో వైఫ‌ల్యం ఎదురైనా అవ‌కాశాల ప‌రంగా జోరందుకుంటుంది. ఇదే త‌ర‌హాలో శ్రీలీల కూడా వ‌రుస ఛాన్సులందుకుంటుంది.

తొలి సినిమా రిలీజ్ కు ముందే రెండు..మూడు ప్రాజెక్ట్ లు రెడీగా చేతిలో పెట్టుకుంది. బాలీవుడ్ మేకర్స్ కూడా ఈ మ‌ధ్య కాలంలో సౌత్ భామ‌లకు పెద్ద పీట వేస్తున్నారు. ట్యాలెంటెడ్ బ్యూటీల‌కు అవ‌కాశాలు క‌ల్పించ‌డానికి ముందుకొస్తున్నారు. మునుప‌టి ప‌రిస్థితికి పూర్తి భిన్న‌మైన స‌న్నివేశం బాలీవుడ్ మార్కెట్ లో క‌నిపిస్తోందిప్పుడు.

Tags:    

Similar News