కీర్తి సురేష్ కొత్త మూవీ.. RDX హీరోతో యాక్షన్ డ్రామా!
సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో స్టార్ హీరో విజయ్ దేవరకొండతో వర్క్ చేస్తున్న అమ్మడు.. కోలీవుడ్ లో నటుడు మిష్కిన్ తో యాక్ట్ చేస్తున్నారని టాక్.;
సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో స్టార్ హీరో విజయ్ దేవరకొండతో వర్క్ చేస్తున్న అమ్మడు.. కోలీవుడ్ లో నటుడు మిష్కిన్ తో యాక్ట్ చేస్తున్నారని టాక్. అయితే తాజాగా కొత్త మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది. మరోసారి మాలీవుడ్ సినిమా చేయనున్నారు అమ్మడు.
కుంచాకో బోబన్ వల్లియుం తేట్టి పుల్లియుం తేట్టి ఫేమ్ రిషి శివ కుమార్ దర్శకత్వంలో కీర్తి సురేష్ యాక్షన్ డ్రామా చేయనున్నారు. పెపేగా ప్రసిద్ధి చెందిన ఆంటోనీ వర్గీస్ సరసన నటించనున్నారు. తొలిసారి ఆయనతో స్క్రీన్ ను షేర్ చేసుకోనున్నారు. రీసెంట్ గా మేకర్స్.. పెపే కీర్తి ప్రాజెక్ట్ గా సినిమాను ప్రకటిస్తూ డిటైల్స్ ను రివీల్ చేశారు.
స్టోరీని విన్నాక పేపేతోపాటు కీర్తి సురేష్.. ప్రాజెక్ట్ పేపర్స్ పై అధికారికంగా సంతకం చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. "యాక్షన్ అట్రాక్షన్ ను కలుస్తుంది. శక్తి శౌర్యాన్ని కలుస్తుంది! పెపే, కీర్తి సినిమాలో మొదటిసారిగా జతకట్టారు. ది డెమెస్నే కమ్స్ అలైవ్ సూన్ గా సినిమాను వీక్షించండి" అంటూ రాసుకొచ్చారు.
అయితే వీడియోలో కీర్తి సురేష్ చాలా అట్రాక్టివ్ గా కనిపించారు. స్పెషల్ సూట్ డ్రెస్ తో ఫిదా చేశారని చెప్పాలి. తన స్వాగ్ అండ్ నవ్వుతో మైమరపించారు. ఆమె మెడలో మంగళసూత్రం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అటు పెపే కూడా తనదైన మాస్ లుక్ లో సందడి చేశారు. ఆయన వాకింగ్ స్టైల్ అయితే అందరినీ ఆకట్టుకుంది.
ఇక సినిమా విషయానికొస్తే.. AVA ప్రొడక్షన్స్, ఫస్ట్ పేజ్ ఎంటర్టైన్మెంట్, మార్గా ఎంటర్టైనర్స్ బ్యానర్లపై మోను పజెదత్, AV అనూప్, నవల వింధ్యన్, సిమ్మి రాజీవన్ గ్రాండ్ గా నిర్మించనున్నారు. తారాగణం, కథాంశం, శైలి వివరణతోపాటు సాంకేతిక సిబ్బంది గురించి మరిన్ని వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడించనున్నారు.
అయితే యాక్షన్ చిత్రం RDXలో చివరిసారిగా కనిపించిన ఆంటోనీ వర్గీస్ ప్రస్తుతం పాల్ జార్జ్ దర్శకత్వం వహించిన కట్టాలన్ షూటింగ్ లో ఉన్నారు. దుల్కర్ సల్మాన్ నటించిన రాబోయే చిత్రం ఐయామ్ గేమ్ లో కూడా కనిపించనున్నారు. మరోవైపు కీర్తి సురేష్ గతంలో మలయాళ చిత్ర పరిశ్రమలో నటించిన కోర్టు డ్రామా చిత్రం వాషికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ సమీక్షలు వచ్చాయి. మరి ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి.