దమ్ములేని బ్రహ్మి రోల్!
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో లీడ్ రోల్ చేస్తూ చేసిన మూవీ కీడాకోలా. ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి ఎవరేజ్ టాక్ సొంతం చేసుకుంది.
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో లీడ్ రోల్ చేస్తూ చేసిన మూవీ కీడాకోలా. ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి ఎవరేజ్ టాక్ సొంతం చేసుకుంది. డార్క్ కామెడీతో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి పర్వాలేదనే స్పందన వస్తోన్న బయట మాత్రం పెద్దగా రీసౌండ్ చేయడం లేదు. తరుణ్ భాస్కర్ గత సినిమాలతో పోల్చుకుంటే పెద్దగా వర్క్ అవుట్ కాలేదనే మాట వినిపిస్తోంది.
ఈ సినిమాలో స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఓ కీలక పాత్రలో కనిపించారు. ఈ పాత్ర పూర్తిగా వీల్ చైర్ కి పరిమితం అవుతుంది. వీల్ చైర్ లో ఉంటూనే అతని పాత్రతో తరుణ్ భాస్కర్ కామెడీ పండించాలని ప్రయత్నం చేశారు. గత కొంతకాలంగా బ్రహ్మానందం సినిమాలు తగ్గించేశారు. ఒకప్పటి స్పీడ్ తో మూవీస్ చేయడం లేదు. చివరిగా జాతిరత్నాలు సినిమా క్లైమాక్స్ లో జడ్జ్ పాత్రలో బ్రాహ్మి కామెడీ పండించారు.
అనుదీప్ బ్రహ్మానందంతో మంచి కామెడీని జెనరేట్ చేశారు. తరువాత రంగామార్తాండ సినిమాలో బ్రహ్మానందం సీరియస్ రోల్ చేశారు. కృష్ణవంశీ చాలా ఏళ్ళ తర్వాత ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చేయని విధంగా బ్రహ్మానందం క్యారెక్టర్ ని చూపించారు. ఆ పాత్రకి బ్రాహ్మి కూడా పూర్తిగా న్యాయం చేశారు. సీరియస్ రోల్ లో ప్రేక్షకులని కన్నీళ్లు పెట్టించారు. అయితే తరుణ్ భాస్కర్ మాత్రం బ్రహ్మానందం నుంచి మంచి డార్క్ కామెడీ జెనరేట్ చేయాలని అనుకున్నారు.
కాని సినిమాలో అతని పాత్ర అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. ఉన్నది కొద్ధిసేపీ అయిన బ్రహ్మానందం పాత్రతో తరుణ్ భాస్కర్ ఆశించిన స్థాయిలో కామెడీని రప్పించుకోలేకపోయాడనే టాక్ వినిపిస్తోంది. బ్రహ్మానందం తన పాత్రకి పూర్తిగా న్యాయం చేశారు. కాని ప్రేక్షకులు కోరుకునే హాస్యం మాత్రం ఈ రోల్ నుంచి అందలేదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
వయస్సు పైబడిన సరైన పాత్ర పడితే మాత్రం బ్రహ్మానందం నుంచి ప్రేక్షకులకి కావాల్సినంత వినోదం అందించవచ్చని జాతిరత్నాలు సినిమాతో అనుదీప్ ప్రూవ్ చేశారు. అలాగే సీరియస్ రోల్స్ కి కూడా బ్రహ్మానందం మంచి ఛాయస్ గా మారుతాడని రంగామార్తండ సినిమాతో ప్రూవ్ అయ్యింది. మరి అలాంటి బలమైన పాత్రలని దర్శకులు బ్రాహ్మికి ఇస్తారా అనేది చూడాలి.